పార్లమెంట్ లో టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం కేంద్ర అధికార పార్టీ బీజేపీకి పెద్ద షాక్ తగలేకపోయినా ఆంధ్రా బీజేపీ నాయకులకు మాత్రం ఎక్కడో గుచ్చుకుంది.అందుకే ఒకరి తరువాత ఒకరు అన్నట్టుగా మొత్తం బీజేపీలో రాష్ట్ర నాయకులుగా గుర్తింపు ఉన్న వారంతా మీడియా ముందుకు వచ్చి తమ ప్రతాపం చూపించారు.
ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడానికి బీజేపీ ది పావలా వంతు కూడా తప్పులేదని , మొట్ట అంతా టీడీపీ వైఖరివల్లే హోదా రాలేదు అంటూ జరిగిన నష్టాన్ని పూడ్చుకునే వ్యాఖ్యలు చేశారు.మాములుగా ఆదిపత్యపోరులో సతమతం అవుతున్న బీజేపీయే నాయకులు ఇప్పుడు మాత్రం వరుసపెట్టి టీడీపీ మీద విరుచుపడ్డారు.
పార్లమెంట్‌లో జరిగిన అవిశ్వాస తీర్మానంపై చర్చలో.దేశంలో ప్రధాన సమస్యలన్నింటినీ పార్టీలు లేవనెత్తాయి.ఒక్కటంటే.దానికి కూడా అధికార పక్షం నుంచి సమాధానం రాలేదు.
చరిత్ర చెప్పుకుని కాంగ్రెస్ నేతలు ఎవరెవర్నో అమానించారంటూ.చెప్పుకునేందుకు తాపత్రయ పడ్డారు.
మోదీ మాత్రం టీడీపీని టార్గెట్ చేసుకుని కొన్ని టెక్నీకల్ పాయింట్స్ మాట్లాదారు తప్ప పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు.కానీ ఏపీ బీజేపీ నాయకులు మాత్రం ఓ రేంజ్ లో రెచ్చిపోయారు.

ఏపీకి నిజమైన ద్రోహులెవరో తేలిపోయిందని దగ్గుపాటి పురంధరేశ్వరి టీడీపీని ఉద్దేశించి మాట్లాడారు.ఆ తరువాత ఎమ్మెల్సీ సోము వీర్రాజు కూడా అదే స్థాయిలో విరుచుపడ్డారు.ఆవేశంతో ఊగిపోయారు.అసలు ఏపీని ఆదుకున్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని అయన చెప్పుకొచ్చారు.ఈ ఘటనలో బీజేపీ ధీ తప్పు అని వివిధ పత్రికలు రాయడాన్ని ఆయన తప్పుపట్టారు.ఇక పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రైల్వేజోన్ తీసుసుకొస్తాననే ఏకైక ఎజెండాతో ప్రచారం చేసుకుని గెలిచిన రాం మాధవ్ కూడా మరింత ముందుకెళ్లిపోయారు.
టీడీపీలో తిరుగుబాటు వస్తుందని జోస్యం చెప్పేశారు.పార్లమెంట్‌లో జరిగిన అవిశ్వాస చర్చలో బీజేపీదే పైచేయి అని చెప్పుకొచ్చారు.ఇక పార్లమెంట్‌లో తానే ఆర్థిక మంత్రినన్నట్లుగా అకౌంట్ నెంబర్ వేస్తే.బ్యాంకులు తెరిచే సమయానికి డబ్బులేస్తానన్నట్లుగా ఆవేశపడిపోయిన విశాఖ ఎంపీ హరిబాబు తాను పదవి నుంచి దిగిపోయేలోపు రైల్వేజోన్ వస్తుందని చెప్పారు.