ఏపీ బీజేపీలో( AP BJP ) అసంతృప్త నేతలను పార్టీ అధిష్టానం బుజ్జగించే ప్రక్రియను మొదలుపెట్టింది.పొత్తుల నేపథ్యంలో పార్లమెంట్ సీట్లను ఆశించి భంగపడిన కొందరు సీనియర్ నాయకులు హైకమాండ్ పై గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో వారిని బుజ్జగించేందుకు ఏపీ ఎన్నికల ఇంఛార్జ్ అరుణ్ సింగ్( Arun Singh ) రంగంలోకి దిగారు.
ఇందులో భాగంగా రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో అసంతృప్తులతో ఆయన భేటీ అయ్యారు.
ఇందులో భాగంగా సత్యకుమార్ మరియు విష్ణువర్ధన్ రెడ్డితో అరుణ్ సింగ్ కీలక సమావేశమై బుజ్జగిస్తున్నట్లు సమాచారం.







