కోనసీమ జిల్లా, కొత్తపేట నియోజక వర్గం: కోనసీమ జిల్లా పర్యటనలో భాగంగా వరద ప్రభావిత పరిశీలించిన రాష్ట్ర బిజెపి అధ్యక్షులు సోము వీర్రాజు.కొత్తపేట మండలం వానపల్లి సత్తమ్మ లంక గోదావరి వరద బాధిత ప్రాంతాలలో నష్టపోయిన రైతులను పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఎప్పటినుండో సాంప్రదాయంగా వేస్తున్న అంతర పంటలకు ఇన్సూరెన్స్ లేకపోవడం దురదృష్టకరమని సోమ వీర్రాజు అన్నారు.
దీనిపైజిల్లా కలెక్టర్ తక్షణ సమావేశం ఏర్పాటు చేసి రైతులని వెంటనే ఆదుకోవాలని సోమ వీర్రాజు డిమాండ్ చేశారు.
స్థానిక శాసనసభ్యులు దీనిపై దృష్టి సారించి రైతుల ఆదుకుని న్యాయం జరిగేలా చేయాలని సోమ వీర్రాజు సూచించారు.
డిజాస్టర్ మేనేజ్మెంట్ నిధులు కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం రాష్ట్రానికి 1000 కోట్లు బడ్జెట్ కేటాయించడం జరుగుతుందని, అమౌంట్ ని వేరే అకౌంట్లకు మళ్ళించడం పట్ల హైకోర్టు సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని మందలించింది సోము వీర్రాజు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం వెయ్యికోట్ల ఈ వరద వంటి విపత్తుల కు నష్టపరిహారణకు వెంటనే ఉపయోగించాలని సోమ వీరాజు బిజెపి తరఫున డిమాండ్ చేశారు.