లెక్కలు సరిచేస్తానంటున్న చిన్నమ్మ?

ఆంధ్రప్రదేశ్లో బిజెపి జనసేన మిత్రపక్షాలుగా చాలా కాలం గా కొనసాగుతున్నప్పటికీ ఈ రెండు పార్టీలకు మధ్య ఏదో తెలియని దూరం ఉందంటారు రాజకీయ పరిశీలకులు ఉమ్మడి కార్యాచరణ పక్కన పెడితే కనీసం కలిసి ఒక ప్రెస్ మీట్ కూడా ఇంతవరకు పెట్టలేని మిత్ర పక్షాలలుగా ఈ రెండు పార్టీలకు గుర్తింపు ఉంది .తనకు ఢిల్లీలోని భాజాపా నేతలతో మంచి సంబంధాలు ఉన్నాయి తప్ప రాష్ట్రస్థాయి నేతలతో పెద్దగా పరిచయం లేదని పవన్ తరచూ వ్యాఖ్యానిస్తుంటారు మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు పదవిలో కూర్చున్న కొత్తలో పవన్ కళ్యాణ్ తో( Pawan Kalyan ) కొంత సాన్నిహిత్యం ప్రదర్శించినప్పటికీ తదనంతర పరిణామాలతో వారి మధ్య దూరం పెరిగింది అంటారు.

ముఖ్యంగా చంద్రబాబును( Chandrababu Naidu ) అమితంగా వ్యతిరేకించే సోము వీర్రాజు తెలుగుదేశంతో కలిసి నడవాలి అనుకుంటున్న పవన్ వ్యవహార శైలి వల్ల వీరి మధ్య కనిపించని అంతరం ఏర్పడింది అంటారు.దానికి అనుగుణంగానే తిరుపతి ఉప ఎన్నికల్లో తప్ప ఏ ఉప ఎన్నికలలో కానీ ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలలో కానీ ఈ రెండు పార్టీల కార్యకర్తలు కలిసి నడిచిన వాతావరణం కనిపించలేదు .అయితే ఇప్పటివరకు ఒక లెక్క ఇకనుంచి ఒక లెక్క అంటున్నారు భాజపా నూతన అధ్యక్షురాలు పురందేశ్వరి.( Purandeshwari ) తాము ఆంధ్ర ప్రదేశ్ లో జనసేనకు మాత్రమే మిత్రపక్షమని ,టిడిపికి వైసీపీకి సమాన దూరం పాటిస్తున్నామని ఆమె విలేకరులతో చెప్పుకొచ్చారు.

ఇకపై పవన్ కళ్యాణ్ తో నిరంతరం టచ్ లో ఉంటూ చర్చిస్తామని ఉమ్మడి కార్యాచరణ దిశగా రెండు పార్టీలను ముందుకు తీసుకెళ్తామంటూ ఆమె వ్యాఖ్యలు చేశారు.గతంలో జరిగిన పొరపాట్లను సవరించుకుంటూ ముందుకు వెళ్తామని వచ్చే ఎన్నికలకు క్రియాశీలక పాత్ర పోషించే విధంగా తమ రెండు పార్టీల కార్యాచరణ ఉంటుందని చెప్పారు.తెలుగుదేశంతో పొత్తు కు పవన్ కళ్యాణ్ ఆసక్తితో ఉన్నారు కదా అన్న విలేకరుల ప్రశ్నకు పొత్తులు కేంద్ర స్థాయిలో పార్టీ నిర్ణయం తీసుకుంటుందని అప్పుడు వాటిపై మాట్లాడతానంటూ ఆమె తెలిపారు.

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో కొత్త సినిమాకి కమిట్ అయిన రవితేజ...డైరెక్టర్ ఎవరంటే..?
Advertisement

తాజా వార్తలు