విజయవాడ: రాష్ట్రంలో వైసిపి పాలనపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పూరందేశ్వరి కామెంట్స్.పార్టీని బలోపేతం చేస్తానని నమ్మకంతో బాధ్యతలు అప్పగించినందుకు ధన్యవాదాలు.
శక్తివంచన లేకుండా కార్యకర్తలను కలుపుకుని ముందుకు వెళ్తాను.గతంలో పనిచేసిన అధ్యక్షుల సహకరంతో ముందుకు వెళ్తాను.
అవినీతికి దూరంగా అభివృద్ధికి దగ్గరగా బీజేపీ ఉంటుంది.రాష్ట్రంలో బీజేపీ పై దుష్ప్రచారం నడుస్తుంది.
ఓట్లతో సంబంధం లేకుండా ఏపీ కి బీజేపీ సహకారం అందించింది.ఏపీకి PMAY కింద 22 లక్షల ఇళ్ల కోసం 32 వేల 500 కోట్లు ఇచ్చింది.
ఇళ్ల కోసం 20 వేల కోట్లు ఇప్పటికే కేంద్రం ఇచ్చింది.రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల విషయంలో ప్రజలకు సమాధానం చెప్పాలి.
జాతీయ రహదారులు తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ రోడ్లు వేసిందో చెప్పాలి.రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన వారు వెనక్కి వెళ్లిపోతున్నారు.
రైతులను ఏపీ ప్రభుత్వం మోసం చేస్తుంది.
పోలవరం ప్రాజెక్టు చేయలేకపోతే కేంద్రానికి అప్పగించాలి.40 నుంచి 50 వేల కోట్ల బిల్లులు ఏపీ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు చెల్లించాల్సి ఉంది.రాష్ట్రంలో శాంతిభద్రతలు అసలున్నాయా?రాష్ట్రంలో మహిళలకు,ప్రజాప్రతినిధులు కి రక్షణ లేదు.నాణ్యత లేని మద్యంతో మహిళల పుస్తెలు తెంపుతున్నారు.రాష్ట్రంలో కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.సొంత బాబాయ్ హత్య కేసుని దర్యాప్తు చేయలేమని చేతులెత్తేశారు.పదో తరగతి బాలుడిని పెట్రోల్ పోసి చంపేశారు .అధికార పార్టీ ఎంపీ ఇంట్లో కిడ్నాపర్లు రెండు రోజులు ఉన్నారు.దశల వారి మధ్య నిషేధం సంగతి ఏంటి.
నాణ్యతలేని మద్యంతో మహిళల పుస్తెలు తెగుతున్నాయి.మద్యంలో భారీ కుంభకోణం జరుగుతుంది.
పొత్తులపై పార్టీ అధిష్టానం చూసుకుంటుంది.జనసేనతో కలిసి ఉన్నాం.
జనసేనతో కలిసి మొన్న ఉన్నాం.నిన్న ఉన్నాం.
రేపు ఉంటాం.సమస్యలు ఏమైనా ఉంటే సమన్వయం చేసుకుంటాం.







