ఈనెల 15వ తారీకు నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు..!!

అనేక వాయిదాల తర్వాత నేడు ఏపీ క్యాబినెట్ సమావేశం జరుగుతున్న సంగతి తెలిసిందే.ఉదయం 11 గంటలకు సీఎం అధ్యక్షతన మంత్రులు క్యాబినెట్ సమావేశంలో పాల్గొన్నారు.

 Ap Assembly Meetings From 15th Of This Month Ap Assembly, Ys Jagan, Chandrababu,-TeluguStop.com

ఇటువంటి తరుణంలో ఈనెల 15వ తారీకు నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరిపించడానికి క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది.దాదాపు వారం రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు జరిపించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

కాగా ప్రస్తుతం జరుగుతున్న క్యాబినెట్ సమావేశంలో పరిశ్రమల ఏర్పాటు పెట్టుబడుల అంశంపై ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. ఇదే క్యాబినెట్ సమావేశంలో గ్రీన్ ఎనర్జీ రంగంలో.

పెట్టుబడులు పెట్టిన 81 వేల కోట్లకు ఆమోదం క్యాబినెట్ తెలపనుంది.కడప ఇంకా కాకినాడ వంటి చోట్ల కొత్తగా ఏర్పడనున్న పరిశ్రమలపై ఈ క్యాబినెట్ సమావేశంలో చర్చ జరుగుతున్నట్లు సమాచారం.

 ఇదిలా ఉంటే ఏపీ ప్రతిపక్ష నేత టీడీపీ అధినేత చంద్రబాబు అసెంబ్లీలో అడుగు పెట్టనని గతంలో ప్రకటించడం తెలిసిందే.మరి వచ్చేవారం జరగబోయే అసెంబ్లీ సమావేశాలకు టీడీపీ ప్రజా ప్రతినిధులు హాజరవుతారా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube