న్యూస్ రౌండప్ టాప్ - 20 

1.జగన్ కు లోకేష్ లేఖ

సంక్షోభం నుంచి ఆక్వా రంగాన్ని గట్టెక్కించాలని కోరుతూ ఏపీ సీఎం జగన్ కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు.

 

2.రాజ్ భవన్ ముట్టడికి కాంగ్రెస్ ప్రయత్నం

   హైదరాబాద్ లోని రాజ్ భవన్ ముట్టడికి కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చిన నేపథ్యంలో విడతలవారీగా కాంగ్రెస్ కార్యకర్తలు రాజ్ భవన్ ముట్టడికి వచ్చారు.మోదీ కో హటావ్ దేశ్ కో బచావ్ నినాదాలతో రాజ్ భవన్ ను ముట్టడించే ప్రయత్నం చేయడంతో కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 

3.వల్లభనేని వంశీ అడ్డుకున్న జనసేన శ్రేణులు

 

కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్ లో ఉద్రిక్త వాతావరణ నెలకొంది ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ దగ్గర వంశీని అడ్డుకునేందుకు జనసేన శ్రేణులు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. 

4.గౌతు శిరీష కు సీఐడీ నోటీసులపై ఏపీ హై కోర్టు స్టే

 

టీడీపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  గౌతు శిరీష కు ఊరట లభించింది.శిరీష సీఐడీ ఇచ్చిన నోటీసులపై హైకోర్టు స్టే విధించింది. 

5.ఖైరతాబాద్ లో బైక్ నిప్పు పెట్టిన కాంగ్రెస్ నేతలు

  హైదరాబాద్ నగరంలోని ఖైరతాబాద్లో కాంగ్రెస్ నేతల్లో ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది.

Advertisement

రోడ్డుపై యువజన కాంగ్రెస్ నేతలు బైక్ కు నిప్పు పెట్టారు.ఆర్టీసీ బస్సులను అడ్డుకుని ధ్వంసం చేయడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. 

6.96 రోజుకు షర్మిల పాదయాత్ర

 

వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన పాదయాత్ర నేటికి 96 వ రోజు కి చేరుకుంది .ఖమ్మం నియోజకవర్గం దంసలాపురం పురం క్యాంప్ నుంచి ఆమె యాత్ర ఈ రోజు ప్రారంభమైంది. 

7.కొనసాగుతున్న బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళన

  రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం లో విద్యార్థుల ఆందోళన మూడో రోజు కొనసాగుతోంది. 

8.టీటీడీ ఈవో పై అసత్య ప్రచారం.కేసు నమోదు

 

తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి పై సామాజిక మాధ్యమాలలో అసత్య ప్రచారం చేసిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.ఎక్స్టెన్షన్ కోసం ఢిల్లీలో లాబీయింగ్ చేయడానికి 300 శ్రీవారి కల్యాణోత్సవం లడ్డూలను ఢిల్లీకి తరలించారు అని కొద్ది రోజుల క్రితం టీటీడీ ఈఓ పై సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. 

9.జగన్ పై చంద్రబాబు విమర్శలు

  ఏపీలో సైకో పాలన నడుస్తోందని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విమర్శించారు. 

10.భారత్ లో కరోనా

 

గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 12,213 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

11.మద్యం షాపులపై పేడ విసిరిన ఉమా భారతి

 మధ్య ప్రదేశ్ మాజీ సీఎం ఉమా భారతి మధ్యప్రదేశ్ లో ఓ మద్యం దుకాణం పై పేడ విసిరి తన ఆగ్రహాన్ని వెళ్లగక్కారు.మద్యం పై పూర్తిగా నిషేదం విధించాలి అని ఈ సందర్భంగా ఆమె డిమాండ్ చేశారు. 

12.కెసిఆర్ పై ఉత్తమ్ కామెంట్స్

 

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

తెలంగాణ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు చేశారు." ప్రతిపక్షాల సమావేశానికి టిఆర్ఎస్ హాజరు కాకపోవడం వెనుక కేసీఆర్ కుట్ర దాగి ఉందని , అందుకే రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇచ్చేలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. 

13.ఆత్మకూరు ఎన్నికల ప్రచారానికి జయప్రద

  ఆత్మకూరు ఉప ఎన్నికలలో బిజెపి స్టార్ క్యాంపెయినర్ గా జయప్రద ను ఆ పార్టీ ప్రకటించింది జూన్ 23న ఆత్మకూరు ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. 

14.  యోగి బుల్డోజర్ యాక్షన్ పై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరణ

 

Advertisement

ఉత్తరప్రదేశ్ లో రాళ్లువిసిరిన సంఘటనలో నిందితుల అక్రమాస్తులపై బుల్డోజర్ తో చర్యలు చేపట్టడం పై సుప్రీం లో పిల్ దాఖలైంది.బుల్డోజర్ చర్యలను  నిలిపివేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. 

15.ఎస్సై చొక్కా పట్టుకున్న రేణుకా చౌదరి

  రాజ్ భవన్ ను ముట్టడించేందుకు వెళ్తున్న కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు ఈ సందర్భంగా తనను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించిన పోలీస్ అధికారి చొక్కా ను మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి పట్టుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. 

16.కేఏ పాల్ కామెంట్స్

 

రాష్ట్రపతి ఎన్నికల్లో  తనను సహకరించాల్సిందిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా కోరినట్లుగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె ఏ పాల్ తెలిపారు.   

17.శత వసంతాల వేడుకల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ

  తన తల్లి హీరాబెన్ శత వసంత వేడుకల్లో ప్రధాని నరేంద్రమోదీ ఈ నెల 18 న పాల్గొననున్నారు. 

18.టీడీపీ ,వైసీపీ లకు సిపిఐ సూటి ప్రశ్న

 

రాష్ట్రపతి ఎన్నికల్లో ఏసు లోని అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ వైఖరి ఏంటి అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సూటిగా ప్రశ్నించారు. 

19.జగన్ కు జనసేన సవాల్

 ఏపీ సీఎం జగన్ కు జనసేన పార్టీ సవాల్ విసిరింది.

ఇటీవల పుట్టపర్తి జిల్లాలో జరిగిన సభలో జగన్ మాట్లాడుతూ జనసేన పవన్ కళ్యాణ్ గురించి కామెంట్లు చేశారు.  వారు అసలు కౌలు రైతులే కాదు అని జగన్ విమర్శలు చేశారు.

దీనిపై జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పందించారు.వారు రైతులే కాదంటూ జగన్ మాట్లాడి వారిని అవమానించారని ప్రభుత్వం నుంచి ఎవరైనా తమతో వస్తే పవన్ పరామర్శిస్తున్న వారందరినీ చూపిస్తామని వారు కౌలు రైతులు కాదు మీరే తేల్చుకోవాలి అంటూ సవాల్ విసిరారు  

20.

ఈరోజు బంగారం ధరలు

  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 47,550   24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 51,870.

తాజా వార్తలు