న్యూస్ రౌండప్ టాప్ 20

1.సీఎం కేసీఆర్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు

సుల్తాన్ బజార్ పిఎస్ లో తెలంగాణ సీఎం కేసిఆర్ పై ఫిర్యాదు అందింది.

దేవతలను కించపరుస్తూ కేసీఆర్ మాట్లాడాలని భజరంగదల్ నేతలు ఫిర్యాదు చేశారు. 

2.నెహ్రూ జూ పార్క్ లో పెరిగిన వరద ఉదృతి

  హైదరాబాద్ నెహ్రూ జూ పార్క్ లో వరద ఉధృతి పెరిగింది.మీరాలం చెరువు నుంచి నీరు జూ పార్క్ లోకి వస్తోంది. 

3.వికారాబాద్ లో మంత్రి సభిత పర్యటన

 

ఈరోజు తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వికారాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు.వర్షాలతో వికారాబాద్ జిల్లా లో కురుస్తున్న వర్ష ప్రభావ ప్రాంతాల్లో ఆమె పర్యటిస్తున్నారు. 

4.హైదరాబాద్ తిరుపతి ప్రత్యేక రైళ్లు

  నెల 19 , 20 తేదీల్లో హైదరాబాద్ తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు మధ్య రైల్వే అధికారులు తెలిపారు. 

5.భారత్ లో కరోనా

 

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 16,906 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

6.అగ్నిపథ్ పై సుప్రీం కోర్టు విచారణ

  కేంద్రం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకం పై సుప్రీం కోర్టు లో ఈ నెల 15 న విచారణ జరగనుంది. 

7.జేపీ నడ్డా కామెంట్స్

 

Advertisement

దేశంలో బిజెపి ఒక్కటే జాతీయ పార్టీని మిగతావన్నీ కుటుంబ పార్టీలే అని బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. 

8.పులి అసకపల్లి లో పులి కలకలం

  అనకాపల్లి జిల్లా సబ్బవరం అసుకపల్లి గ్రామంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. 

9.కార్మికులు తక్షణమే విధులకు హాజరు కావాలి

 

సమన్ విరమణ ప్రదేశి తక్షణమే చర్చల్లో పాల్గొనాలని మంత్రి ఆది మూలపు సురేష్ పిలుపునిచ్చారు. 

10.నేటితో ముగియనున్న శాకాంబరి ఉత్సవాలు

  విజయవాడ లో శాకాంబరీ ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి. 

11.తుంగభద్ర జలాశయం 20 గేట్లు ఎత్తివేత

 

తుంగభద్ర జలాశయానికి వరద నీరు పోటెత్తాడంతో దిగువకు అధికారులు నీటిని విడుదల చేశారు. 

12.మాజీ ఎంపీ హర్ష కుమార్ హౌస్ అరెస్ట్

  గోపాలపురం లో పేపర్ ప్లేట్లపై అంబేద్కర్ ఫోటోలు వివాదం పై చలో రావులపాలెం పోలీస్ స్టేషన్ ముట్టడికి మాజీ ఎంపీ హరీష్ కుమార్ పిలుపునివ్వడంతో పోలీసులు ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. 

13.ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక

 

భారీ వర్షాలు నేపథ్యంలో ధవలేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. 

14.శాఖ కార్యదర్శి కి నాన్ బెయిలబుల్ వారెంట్

  కోర్టు విచారణకు గైర్హాజరైన ఆర్థిక శాఖ కార్యదర్శి కెవివి సత్యనారాయణ కు నాన్ బైబుల్ వారెంట్ జారీ చేసింది. 

15.తిరుమలలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం

 

రాజాసాబ్ సినిమా వచ్చేది అప్పుడేనా..?మారుతి ఎందుకంత స్లో గా వర్క్ చేస్తున్నాడు...
సింప్లిసిటీకి పర్‌ఫెక్ట్‌ ఎగ్జాంపుల్‌ ప్రభాస్‌.. వైరల్ అవుతున్న శిరీష్ ఆసక్తికర వ్యాఖ్యలు!

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం కోయిల్ అల్వార్ తిరుమంజనం శ్యా స్త్రోత్యంగా నిర్వహించారు. 

16.లోకేష్ కామెంట్స్

  ప్రజలు తిరగబడక ముందే కబ్జాలు, అరాచకాలు మానండి అంటూ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి విమర్శలు చేశారు. 

17.14న చలో నెల్లూరు

 

Advertisement

పోలీసులు కారణంగా మృతి చెందిన ఉదయగిరి నారాయణ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 14న చలో నెల్లూరుకు బహుజనలంతా కదిలి రావాలని టిడిపి ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజు పిలుపునిచ్చారు. 

18.నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు

 తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి.అయితే మరో రెండు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. 

19.ఎంసెట్ వాయిదా

 

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో 14 ,15వ తేదీల్లో జరగాల్సిన ఎంసెట్ ను వాయిదా వేస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి పేరుతో ప్రకటన విడుదలైంది. 

20.హిజాబ్ అంశంపై వచ్చేవారం సుప్రీమ్ లో విచారణ

  దేశంలో వివాదాస్పదమైన హిజాబ్ వివాదంపై దేశ అత్యంత న్యాయస్థానం సుప్రీంకోర్టు విచారణకు అంగీకరించింది.వచ్చేవారం నుంచి దీనిపై విచారణ చేపడతామని ధర్మాసనం పేర్కొంది.

           .

తాజా వార్తలు