News Roundup: న్యూస్ రౌండప్ టాప్ 20 

1.ఎమ్మెన్నార్ మెడికల్ కాలేజీలో విద్యార్థుల ఆందోళన

ఎమ్మెన్నార్ మెడికల్ కాలేజీలో రెండో రోజు విద్యార్థుల ఆందోళన దిగారు.

ఏడి నారాయణరావు విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడంటూ విద్యార్థులు ధర్నా చేపట్టారు. 

2.పోలీసుల అదుపులో బండి సంజయ్

 

మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభించిన ముందుగానే తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

3.ఇంటివద్దకే పెన్షనర్లకు లైఫ్ సర్టిఫికేట్

 

కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ లకు ఇకపై ఇంటి వద్దే లైఫ్ సర్టిఫికేట్ లభించనుంది.ఈ మేరకు తపాలా శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. 

4.ధరణి రిజిస్ట్రేషన్ ద్వారా 26 లక్షల లావాదేవీలు

ధరణి రిజిస్ట్రేషన్ ద్వారా రాష్ట్రంలో 26 లక్షలకు పైగా లావాదేవీలు జరిగాయని తెలంగాణ ప్రభుత్వం  తెలిపింది. 

5.యూఎన్ ఓ వాతావరణ సదస్సుకు ఉత్తమ్

  ఐక్య సమితి ఆధ్వర్యంలో ఈజిప్టులో ఈనెల 7 నుంచి 10 వరకు జరగనున్న వాతావరణ సదస్సులో భారత పార్లమెంటు తరఫున కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన నున్నారు. 

6.ఢిల్లీ వెళ్లిన మల్లికార్జున ఖర్గే

 

ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొనేందుకు మంగళవారం హైదరాబాద్ కు వచ్చిన ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తిరిగి ఢిల్లీకి వెళ్లిపోయారు. 

7.ఏపీ సి ఎస్ సమీర్ శర్మకు తీవ్ర అస్వస్థత

  ఏపీ సి ఎస్ సమీర్ శర్మ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 

8.సింహాచలం ప్రభుత్వ ఆసుపత్రికి అయ్యన్నపాత్రుడు

 

Advertisement

టిడిపి నేత మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆయన తనయుడు రాజేష్ ను పోలీసులు సింహాచలం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.  అర్ధరాత్రి సమయంలో సిఐడి పోలీసులు అయ్యన్న ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 

9.అయ్యన్న అరెస్టుకు నిరసనగా ఆందోళన

  టిడిపి సీనియర్ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడు అరెస్టుపై గజపతినగరంలో టిడిపి శ్రేణులు ఆందోళన నిర్వహించారు. 

10.ఎమ్మెల్యే సాయి ప్రసాద్ ఇంటి ముట్టడికి రైతుల ప్రయత్నం

 

ఆదోనిలో నకిలీ పత్తి విత్తనాలతో నష్టపోయిన రైతులు ఆందోళనకు దిగారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ ఇంటిని ముట్టడించేందుకు రైతులు ప్రయత్నం చేశారు. 

11.బిజెపి కార్యాలయం వద్ద భారీ బందోబస్తు

  డిజిపి కార్యాలయం వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.మాజీ మంత్రి టిడిపి నేత అయ్యన్నపాత్రుడు అరెస్టుతో ఈ భద్రతను పెంచారు. 

12.ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పోసాని

 

ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా సినీ నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణ మురళికి జగన్ అవకాశం కల్పించారు. 

13.గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

   గుజరాత్ అసెంబ్లీ ఎన్నిక షెడ్యూల్ కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. 

14.రేపు గోకవరం మండలంలో జగన్ పర్యటన

 

రేపు తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో సీఎం జగన్ పర్యటించనున్నారు. 

15.భారత్ జోడో పాదయాత్ర

  కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జూడో పాదయాత్ర సంగారెడ్డి జిల్లా రుద్రారం నుంచి ప్రారంభమైంది. 

16.సింహాద్రి అప్పన్నకు స్వర్ణ పుష్పార్చన

 

విజయవాడలో బిజినెస్ అండ్ టూరిజం వీసాపై సదస్సు
హీరో తేజ సజ్జాకు పాదాభివందనం చేసిన పెద్దాయన.. అసలేం జరిగిందంటే?

విశాఖలో నేడు సింహాద్రి అప్పన్నకు స్వర్ణ పుష్పార్చన స్వర్ణ కవచధారణ జరగనుంది. 

17.గ్రూప్ వన్ దరఖాస్తుల గడువు పెంచిన ఏపీపీఎస్సీ

  గ్రూప్ వన్ దరఖాస్తుల గడువు తేదీని ఏపీపీఎస్సీ పెంచింది.ఈనెల 5వ తేదీ వరకు దరఖాస్తులకు అవకాశం కల్పించారు. 

18.నాదెండ్ల మనోహర్ పర్యటన

 

Advertisement

నేడు అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో జనసేన పార్టీ పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ పర్యటిస్తున్నారు. 

19.పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనుల పరిశీలన

  పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని సిడబ్ల్యుసి ప్రాజెక్టు అథారిటీ సి ఎస్ ఎం ఆర్ ఎస్ 8 మంది సభ్యుల బృందం పరిశీలించింది. 

20.ఈరోజు బంగారం ధరలు

 

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -46,700   24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 50,950.

తాజా వార్తలు