విడివిడిగా...సీతారాముల కళ్యాణం!!!

రాష్ట్ర విభజన ప్రజలకే కాదు.దేవుడికి కూడా చేటు తెచ్చింది.

సాక్షాత్తూ శ్రీ రాముని కల్యాణానికే ఎసరు పెట్టింది.

అసలు విషయం ఏమిటంటే.

రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో శ్రీ సీతారాముల కళ్యాణం రెండు ప్రాంతాల్లో జరగనుంది.సమైక్యాంధ్ర ప్రదేశ్‌లో గోదావరి తీరాన గల భద్రాచలంలో ప్రతి ఏటా సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించేవారు.

రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో తెరాస, టీడీపీ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి.రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సీతారాముల కళ్యాణం కడప జిల్లాలోని ఒంటిమిట్ట రామాలయంలో అధికారికంగా నిర్వహించనుంది.

Advertisement

విభజనలో భాగంగా భద్రాచలం ఆలయం తెలంగాణ రాష్ట్రంలో ఉంది.భద్రాచలంను ఏపీకి ఇవ్వాలని మొదట సీమాంధ్ర నేతలు పట్టుబడ్డారు.1956కు ముందు భద్రాచలం ఏపీలో ఉండేదని, ఇప్పుడు కూడా తమకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.భౌగోళిక, ప్రజాభిప్రాయం.

ఇలా పలు కారణాలతో భద్రాచలం తెలంగాణలో ఉండిపోయింది.అయితే, భద్రాచలం చుట్టుపక్కల ప్రాంతం పోలవరం ప్రాజెక్టు కోసం ఏపీలోకి వెళ్లిపోయిన విషయం తెలిసిందే.

భద్రాచలం తెలంగాణ రాష్ట్రంలో ఉండిపోయింది.తెలంగాణ సాధించిన తర్వాత తొలిసారి వచ్చిన సీతారాముల కళ్యాణం కాబట్టి అధికార తెరాస ప్రభుత్వం.

ఈ కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది.మరోవైపు, ఆంధ్రప్రదేశ్ సీతారాముల కళ్యాణం కోసం చరిత్ర కలిగిన ఒంటిమిట్ట రామాలయాన్ని ఎంచుకుంది! శుక్రవారం నాడు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాల రావు ఈ విషయమై చెప్పారు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
భూములపై చంద్రబాబు దుష్ప్రచారం.. సీఎం జగన్ ఫైర్

కడప జిల్లాలోని అత్యంత పురాతన ఆలయమైన ఒంటిమిట్ట ఏకశిలానగరం రామాలయంలో సీతారాముల కళ్యాణం నిర్వహిస్తామని చెప్పారు.రాముల వారి కళ్యాణానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తరఫున పట్టవస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారని చెప్పారు.

Advertisement

ఏది ఏమైనా విభజన కష్టాలు దేవుడికి సైతం తప్పడంలేదు.

తాజా వార్తలు