పీకే పొలిటికల్ ఎంట్రీతో.. ఏపీ, తెలంగాణ మంత్రులకు షాక్?

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇప్పుడ నేరుగా పోలిటికల్ ఎంట్రీ ఇస్తున్నాడు.ఆ విషయం ట్వీటర్ వేదికగా ప్రశాంత్ కిషారో ప్రకటించారు.

 Ap And Telangana Minister Face Issues With Prasanth Kishor New Political Party D-TeluguStop.com

అయితే ఇన్ని రోజులు దేశంలో పలు రాజకీయ పార్టీలకు సేవలు అందించారు.ఇప్పుడ కొత్త పార్టీకి ప్రశాంత్ కిషార్ సిద్ధమైయాడు.

బీహార్ నుంచే జన్ సురాజ్ పేరుతో కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నారు.

కేంద్ర, రాష్ట్రాల్లో అధికారం చెలాయిస్తున్న పలు కూటములు, పార్టీల్ని పీకే లక్ష్యంగా చేసుకోబోతున్నారా ? తద్వారా ఆయన ఏం ఆశిస్తున్నారన్న చర్చలు మొదలయ్యాయి.ప్రశాంత్ కిషోర్ ఇక ప్రత్యక్ష రాజకీయాలు చేయాలని డిసైడ్ అయిపోయారు.కాంగ్రెస్, బీజేపీ వంటి జాతీయ పార్టీలతో పాటు ప్రాంతీయ పార్టీల చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయిన పీకే.

ఇప్పుడు తానే రాజకీయ పార్టీ పెట్టి తన కోసం గెలుపు వ్యూహం రచించేందుకు సిద్దమయ్యారు.ట్విట్టర్ వేదికగా జన సురాజ్ పేరుతో కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు పీకే చేసిన ప్రకటన దేశ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది.

పీకే ప్రకటనతో ఇప్పటికే ఆయన సలహాలు తీసుకుంటున్న, భవిష్యత్తులో తీసుకోవాలని భావిస్తున్న పార్టీలన్నీ గందరగోళంలో పడ్డాయి.ప్రశాంత్ కిషోర్ చేసిన కొత్త రాజకీయ పార్టీ ప్రకటన ముఖ్యంగా విపక్ష కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చింది.

నిన్న మొన్నటివరకూ కాంగ్రెస్ పార్టీలోకి తాను వస్తానని చెప్పినా కమిటీల పేరుతో కాలయాపన చేసిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు పీకే భారీ షాక్ ఇచ్చినట్లయింది.

Telugu Ap Telangana, Congress, Jagan, Jan Suraj, Strategist, Prasanth Kishor-Pol

పార్టీలోకి వస్తానన్న పీకేను తక్కువ అంచనావేసిన కాంగ్రెస్ ఇప్పుడు ఆయన సేవల్ని పరోక్షంగా కూడా తీసుకునే హక్కు కోల్పోయింది.అలాగే అధికార బీజేపీ సైతం గతంలో పీకే సేవలతో ఎంతో ప్రయోజనం పొందింది.ఇప్పుడు విపక్షంలో ఉన్న ప్రాంతీయ పార్టీలకు సలహాలిచ్చి రాష్ట్రాల్లో తమ ఓటములకు కారణమవుతున్న పీకే ఇప్పుడు జాతీయ స్దాయిలో తమకు ప్రత్యామ్నాయాన్ని స్వయంగా నడిపించే స్ధాయికి చేరుకుంటుండటం ఎన్డీయేకు షాక్ గా మారబోతోంది.

తెలంగాణలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న కేసీఆర్.పీకే సేవల్ని వాడుకోవాలని నిర్ణయించారు.ఈ క్రమంలో ఇప్పటికే పలుమార్లు ఆయనతో భేటీ అయ్యారు.అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా ఏడాది సమయం ఉండటంతో ఈ లోపు పీకే సలహాలతో పార్టీలో పలు మార్పులు చేసుకునేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారు.

Telugu Ap Telangana, Congress, Jagan, Jan Suraj, Strategist, Prasanth Kishor-Pol

ఇలాంటి సమయంలో కాంగ్రెస్ లో చేరేందుకు చేసిన ప్రయత్నాలు టీఆర్ఎస్ ను ఆత్మరక్షణలోకి నెట్టేశాయి.ఆతర్వాత పీకే కాంగ్రెస్ లో చేరకపోవడంతో ఊపిరిపీల్చుకున్న కేసీఆర్ కు ఇప్పుడు కొత్త పార్టీ ప్రకటన భారీ షాకిచ్చినట్లు చెప్పుకోవచ్చు.ముఖ్యంగా ప్రశాంత్ కిషోర్ స్ధానంలో ఐప్యాక్ సేవలు అయినా టీఆర్ఎస్ కు లభిస్తాయా లేదా అన్న అనుమానాలు వ్యక్తమ?య్యాయి.ఇదే కోవలో ఏపీలో 2024లో జరిగే ఎన్నికల్లో మరోసారి అధికారం నిలబెట్టుకోవాలని భావిస్తున్న వైఎస్ జగన్ కు పీకే కొత్త పార్టీ ప్రకటన షాకిచ్చినట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube