మిర్చి సినిమాలో అనుష్క ప్రభాస్ ని నిజంగానే ఎత్తుకుందా.. ఇందులో నిజమెంత?

టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, స్టార్ హీరోయిన్ అనుష్క కలిసిన నటించిన చిత్రం మిర్చి. 2013లో విడుదలైన ఈ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.

 Anushka Reveals How She Lifted Prabhas In Mirchi Movie Song Details, Anushka, Pr-TeluguStop.com

ఈ సినిమా అప్పట్లో ప్రభాస్ సినిమాలలో అతిపెద్ద హిట్ గా నిలిచింది.ఈ సినిమాకు దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.

కొరటాల శివకు అదే మొదటి సినిమా.మొదటి సినిమాతోనే డైరెక్టర్గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకున్నారు.అయితే ఈ సినిమా విడుదల అయ్యి దాదాపు 10 ఏళ్ళు పూర్తి అయింది.

10 ఏళ్ళు అయిన ఈ సినిమా షూటింగ్ లో ప్రభాస్ అనుష్క మధ్య జరిగిన ఓ సంఘటనని మాత్రం అభిమానులు ఇప్పటికీ మరువలేకపోతున్నారు.మిర్చి సినిమాలో పండగలా దిగివచ్చావు అనే పాటలో అనుష్క ప్రభాస్ ని పైకి ఎత్తుకుంటుంది.అనుష్క కూడా హైట్ ఉన్నపటికీ ప్రభాస్ అంతకు మించి ఉంటాడు.ప్రభాస్ లాంటి ఒక కటౌట్ ని మోయాలంటే అది చాల కష్టమైన విషయం అని చెప్పవచ్చు.

Telugu Anushka, Anushka Prabhas, Anushkamirchi, Anushka Shetty, Koratala Siva, M

అయితే మరి ఆ సినిమాలో ప్రభాస్ ని అనుష్క ఎలా ఎత్తుకోగలిగింది అన్నది చాలామంది అభిమానులకు తలెత్తుతున్న ప్రశ్న.కానీ సినిమాలో ప్రభాస్ ని అనుష్క డైరెక్ట్ గా మోయలేదు.ఒక స్టూల్ సహాయంతో ప్రభాస్ ని ఎత్తగలిగింది.

ఇదే విషయాన్నీ అనుష్క ఒక ఇంటర్వ్యూలో వివరించింది.ఈ సన్నివేశం సినిమాకి చాలా హైలైట్ గా నిలిచింది.

ఏదేమైనా ఒక హీరోయిన్.హీరోని మోయడమంటే అది చాల అరుదుగా జరిగే విషయం.

Telugu Anushka, Anushka Prabhas, Anushkamirchi, Anushka Shetty, Koratala Siva, M

అలా అనుష్క ఆరోజు సెట్ లో ప్రభాస్ ని అవలీలగా ఎత్తడంతో చిత్ర యూనిట్ అంతా షాక్ కి గురి అయ్యారట.అప్పట్లోనే ఈ న్యూస్ బాగా వైరల్ గా మారింది.ఇకపోతే అనుష్క ప్రభాస్ జోడీ విషయానికొస్తే.మొదట బిల్లా సినిమాలో కలిసిన ఈ జంట ఆ తర్వాత మిర్చి,బాహుబలి లాంటి సినిమాలలో కలిసి నటించారు.అయితే మీరిద్దరూ స్నేహితులు అని చెప్పినప్పటికీ వీళ్ళిద్దరి త్వరలోనే పెళ్లి చేసుకుని ఒకటికి కాబోతున్నారు అంటూ ఎన్నో రకాల వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.అంతేకాకుండా ప్రభాస్, అనుష్క మధ్య కెమిస్ట్రీస్ బాగా వర్కౌట్ అవుతూ ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube