అనుష్క రెండు కోట్ల ఆఫర్ వదులుకుందట.. అసలు ఆమె తీరే అర్దం కాదే!

బాహుబలి స్టార్ అనుష్క మరో భారీ ఆఫర్‌ ను కాదన్నట్లుగా ప్రచారం జరుగుతుంది.

తమిళ ఫిలిం మేకర్ ఒకరు అనుష్క తో ఒక భారీ లేడీ ఓరియంటెడ్ సినిమా ను తీసేందుకు ప్లాన్ చేశాడట.

కానీ అందుకు అనుష్క నిరాకరించడం తో ఆయన మరో హీరోయిన్ ని వెతికే పనిలో పడ్డాడని తెలుస్తోంది.అనుష్క ఓకే చెప్తే దాదాపుగా రెండు కోట్ల రూపాయల పారితోషికంతో పాటు లాభాల్లో వాటా ను కూడా ఇచ్చేందుకు ఆయన ఓకే చెప్పాడట.

అంటే మొత్తంగా మూడు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అనుష్క వదులుకుంది అంటూ కొందరు అభిప్రాయం చేస్తున్నారు.ఈ మధ్య కాలం లో అనుష్క అస్సలు సినిమాలకు కమిట్ అవ్వడం లేదు.

యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో నవీన్ పోలిశెట్టి తో కలిసి ఒక సినిమా ను చేస్తుంది.మహేష్ ఆ సినిమా కు దర్శకుడు.

Advertisement

ఆ ఒక్క సినిమా తప్పితే అనుష్క ఏ ఒక్క సినిమా ను చేయడం లేదు.అనుష్క కు ఉన్న స్టార్డం నేపద్యం లో ఏడాదికి అరడజను సినిమా లకు పైగా చేయవచ్చు.సక్సెస్ ప్లాప్‌ లతో సంబంధం లేకుండా కమర్షియల్ మరియు లేడీ ఓరియంటెడ్ సినిమా లతో వరుసగా బాక్సాఫీస్ వద్ద అనుష్క సందడి చేసే అవకాశాలు ఉన్నాయి.

కానీ అనుష్క మాత్రం అస్సలు సినిమా ఇండస్ట్రీ పై ఆసక్తి చూపించడం లేదు.ఆమె ఎందుకు ఇండస్ట్రీకి దూరంగా ఉంటుందో అర్థం కావడం లేదు అంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే.

మరి కొందరు మాత్రం అనుష్క మంచి కథల కోసం వెయిట్ చేస్తుంది అంటున్నారు.మంచి కథల కోసం వెయిట్ చేస్తున్న అనుష్క అసలు దర్శకులను కలిసేందుకు కథలు వినేందుకు ఆసక్తి చూపించడం లేదని మరి కొందరు కామెంట్ చేస్తున్నారు.అసలు విషయం ఏంటో అర్థం కావడం లేదు.

మొత్తానికి uv క్రియేషన్స్ వారి నిర్మాణం లో రూపొందుతున్న సినిమా తర్వాత అయినా అనుష్క వరుసగా సినిమాలను చేస్తుందేమో చూడాలి.

'హెలికాప్టర్ ' కోసం ఇంత పంచాయతీ జరుగుతోందా ? 
Advertisement

తాజా వార్తలు