బిల్లా మూవీ చూసి అమ్మ చెప్పిన మాటకు షాకయ్యాను.. అనుష్క సంచలన వ్యాఖ్యలు వైరల్!

తెలుగు ప్రేక్షకులకు స్వీటీ అనుష్క శెట్టి( Anushka Shetty ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అనుష్క ప్రస్తుతం అడపాదడపా సినిమాలలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఇటీవల కాలంలో వరుసగా సినిమాలు చేయడం చాలా వరకు తగ్గించేసింది స్వీటీ.ప్రస్తుతం అనుష్క ఘాటీ సినిమాలో( Ghaati Movie ) నటిస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా ఏప్రిల్ లో విడుదల కానుంది.తాజాగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.

ఇకపోతే అనుష్క డార్లింగ్ ప్రభాస్( Prabhas ) ఇద్దరు కలిసి నటించిన చిత్రం బిల్లా.( Billa Movie ) ఈ సినిమాలో బికినీలో కనిపించి అభిమానులకు ఒకసారిగా షాక్ ఇవ్వడంతో పాటు కుర్ర కారుకు అందాల కనువిందు చేసింది అనుష్క.

Anushka About Billa Movie Details, Anushka, Billa Movie, Tollywood, Prabhas, Anu
Advertisement
Anushka About Billa Movie Details, Anushka, Billa Movie, Tollywood, Prabhas, Anu

అయితే వ్యక్తిగతంగా అనుష్కకి ఇలాంటివి ఇష్టం ఉండవు.సినిమాల్లోకి రాకముందు కేవలం సల్వార్‌ కమీజ్‌ లనే ధరించేది.పాత్ర డిమాండ్‌ మేరకు బిల్లా చిత్రంలో ట్రెండీ డ్రెస్‌లు వేసుకుని మెప్పించింది.

ఇక్కడే అనుష్క షాక్‌ కి గురైంది.నేను ఎప్పుడూ పద్ధతిగా ఉండాలనుకుంటుంది మా అమ్మ.

అలాంటి ఆమె బిల్లా సినిమా చూసినప్పుడు.ఇంకా స్టైలిష్‌గా ఉండవచ్చు కదా.సగం పద్ధతిగా, సగం మోడ్రన్‌ గా ఆ డ్రెస్సులేంటి అని అంది.అప్పుడు నేను చాలా షాకయ్యాను అని ఒక సందర్భంలో చెప్పుకొచ్చింది అనుష్క.

Anushka About Billa Movie Details, Anushka, Billa Movie, Tollywood, Prabhas, Anu

ఈ విషయం తాజాగా మరోసారి వార్తల్లో వైరల్ గా మారింది.ఇకపోతే క్రిష్ దర్శకత్వంలో అనుష్క నటించిన ఘాటీ సినిమా తాజాగా షూటింగ్ పూర్తి అవ్వడంతో ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.ఏప్రిల్‌ 18న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

పైసా ఖర్చు లేకుండా ఈ మ్యాజికల్ హోమ్ మేడ్ సీరం తో తెల్లగా మెరిసిపోండి!

మాదకద్రవ్యాల మాఫియా నేపథ్యానికి ఒక బలమైన సామాజిక అంశాన్ని ముడిపెట్టి క్రిష్‌ ఈ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.కథానాయిక జీవిత ప్రయాణంలోని కఠినమైన కోణాల్ని దీంట్లో ఆవిష్కరించనున్నట్లు అర్థమవుతోంది.

Advertisement

ఇందులో అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తోంది.

తాజా వార్తలు