అనుపమ అందుకే కనిపించట్లేదా..!

కార్తికేయ 2 తో సూపర్ హిట్ అందుకున్న అనుపమ పరమేశ్వరన్ ఆ సినిమా బాలీవుడ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది.ఢిల్లీ టూర్ వరకు అనుపమ పరమేశ్వరన్ కార్తికేయ 2 తో ఉండగా ఆ తర్వాత హైదరాబాద్ టూర్, ముంబై ట్రిప్ లో అనుపమ పరమేశ్వరన్ మిస్ అయ్యింది.

 Anupama Parameswaran Missed Karthikeya 2 Mumbai Tour Here Is The Reason,anupama,-TeluguStop.com

అనుపమ ఎందుకు మిస్ అయ్యిందా అన్న ఆరా తీయగా అనుపమకి కరోనా పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తుంది.హైదరాబాద్ లో థియేటర్ టూర్ పూర్తి చేసుకున్న అనుపమ కొద్దిగా జలుబు, ఫీవర్ రావడంతో టెస్ట్ చేయించుకోగా కొవిడ్ పాజిటివ్ అని తేలిందట.

అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం హోం క్వారెంటైన్ లో ఉంది.నిఖిల్ తో కార్తికేయ 2 హిట్ అందుకున్న అనుపమ అదే నిఖిల్ తో 18 పేజెస్ సినిమా కూడా చేసింది.

ఆ సినిమాకు సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే అందించారు.కుమారి 21F డైరక్టర్ సూర్య ప్రతాప్ ఆ మూవీని డైరెక్ట్ చేశారు.గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో 18 పేజెస్ మూవీ తెరకెక్కింది.ఈ సినిమా కూడా త్వరలోనే రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

 కార్తికేయ 2 సూపర్ హిట్ అవడంతో నిఖిల్ 18 పేజెస్ మూవీకి మంచి బిజినెస్ జరిగే ఛాన్స్ ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube