ప్రేమం బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ఈమధ్య తన ఫాం కోల్పోయినట్టు అనిపించగా దాదాపు తెలుగులో అమ్మడి కెరియర్ ముగిసిందని భావించారు.కానీ అమ్మడు మళ్లీ వరుస సినిమాలతో దూసుకెళ్తుంది.
కార్తికేయ 2 సూపర్ హిట్ కొట్టడంతో ఆ సినిమా వల్ల అనుపమకి ఆఫర్లు వస్తున్నాయి.నిఖిల్ తో 18 పేజెస్ సినిమా చేస్తున్న అనుపమ డీజే టిల్లు సీక్వల్ లో కూడా హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుంది.
ఇక మరోపక్క మాస్ మహరాజ్ రవితేజ ఈగల్ లో కూడా అనుపమ సెలెక్ట్ అయ్యిందని తెలుస్తుంది.
కార్తిక్ ఘట్టమనేని డైరషన్ లో తెరకెక్కుతున్న రవితేజ ఈగల్ సినిమా పక్కా మాస్ ఎంటర్టైనర్ గా వస్తుంది.
ఈ సినిమాలో రవితేజతో అనుపమ రొమాన్స్ చేయనుంది.ఓ విధంగా అనుపమ ఇప్పుడు టాలీవుడ్ లో తన జోరు కొనసాగిస్తుందని చెప్పొచ్చు.
అనుపమ తెలుగులో ఈ రేంజ్ కి వెళ్తుందని ముందే ఊహించిన ఫ్యాన్ ఆమె సినిమాలను ఎంజాయ్ చేస్తున్నారు.అయితే యువ హీరోల సరసన నటిస్తున్న ఆమె స్టార్ ఛాన్సుల కోసం ఎదురుచూస్తుంది.
కార్తికేయ 2 తర్వాత నిఖిల్ తో మరోసారి 18 పేజెస్ సినిమా చేస్తున్న అనుపమ ఆ సినిమాతో కూడా హిట్ కొట్టాలని చూస్తుంది.