కోలీవుడ్ లో బిగ్ ఆఫర్ సొంతం చేసుకున్న క్రేజీ హీరోయిన్  

తమిళంలో అవకాశం సొంతం చేసుకున్న మల్లు భామ..

Anu Emmanuel Gets A Crazy Offer-

మజ్ను సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మల్లు బ్యూటీ అనూ ఇమాన్యూయేల్. ఈ భామ మొదటి సినిమాతోనే నటిగా నిరూపించుకొని హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. ఇక రెండో సినిమాని రాజ్ తరుణ్ లాంటి కుర్ర హీరోతో కిట్టు ఉన్నాడు జాగ్రత్త అనే సినిమా చేసింది..

కోలీవుడ్ లో బిగ్ ఆఫర్ సొంతం చేసుకున్న క్రేజీ హీరోయిన్ -Anu Emmanuel Gets A Crazy Offer

ఈ సినిమా ఫ్లాప్ అయిన ఊహించని విధంగా టాలీవుడ్ లో స్టార్ హీరోలకి జోడీగా అవకాశాలు అందుకుంది. ఇక టాలీవుడ్ లో గోపిచంద్, అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలతో జత కట్టిన ఈ భామకి అస్సలు అదృష్టం కలిసి రాలేదు.తెలుగులో స్టార్ హీరోలతో అను ఎంత వేగంగా అవకాశాలు అందుకుందో అంతే వేగంగా అవకాశాలు కోల్పోయింది.

గ్లామర్ ప్రదర్శనని రెడీ కావడంతో ఈ మల్లు భామకి వరుస అవకాశాలు వచ్చి పడ్డాయి. అను చివరిగా చైతూకి జోడీగా చేసిన శైలజారెడ్డిగారి అల్లుడులో నటించింది. అయితే ఈ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది.

అయితే ఈ భామ ఇప్పుడు ఊహించని విధంగా ఓ క్రేజీ ఆఫర్ సొంతం చేసుకుందని తెలుస్తుంది. విశాల్ కి జోడీగా డిటెక్టివ్ అనే సినిమాలో నటించి కోలీవుడ్ మొదటి హిట్ కొట్టిన అను అక్కడి దర్శకులని ఆకట్టుకోవడంతో ఓ స్టార్ హీరో చిత్రంలో అవకాశం వచ్చిందని తెలుస్తుంది. మరి ఈ సినిమాతోనే అను ఇమాన్యూయేల్ కోలీవుడ్ ఏ మేరకు సెటిల్ అవుతుందో చూడాలి.