అమెరికాకు ఏప్రియల్ గండం..పౌచీ స్ట్రాంగ్ వార్నింగ్..!!!

అగ్ర రాజ్యం అమెరికాను కరోనా అల్లకల్లోలం చేసింది.ఇప్పటికి తన ప్రభావం అమెరికాలో కొనసాగిస్తూనే ఉంది.

రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోవడమే కాక కరోనా మృతుల సంఖ్య రెట్టింపు అవుతోంది.ఈ మహమ్మారి బారిన పడి కేవలం ఒక్క జనవరి నెలలో దాదాపు 50 వేల మంది మృతి చెంది ఉంటారని హాప్కిన్స్ యూనివర్సిటీ అంచనా వేసింది.

డిసెంబర్ నెలలో దాదాపు 70 వేల మంది మృతి చెందారని ప్రకటించింది.అయితే ఈ మహమ్మారి దెబ్బకే అమెరికన్స్ పిట్టల్లా రాలిపోతుంటే కొత్త వైరస్ ఎంట్రీ తో అమెరికన్స్ గుండెలు రైళ్ళు పరిగేట్టిస్తోంది.

తాజాగా అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆంటోని పౌచీ చేసిన వ్యాఖ్యలు మరింత అలజడి కలిగిస్తున్నాయి.అమెరికా అంటువ్యాధుల నిపుణుడు, కరోనా నియంత్రణ కమిటీ కీలక సభ్యుడు అయిన అంటోని పౌచీ తాజాగా సంచనల వ్యాఖ్యలు చేశారు.

Advertisement

కరోనా లో వచ్చిన కొత్త వేరియంట్స్ లో బ్రిటన్ కరోనా మరింత ప్రమాద కరంగా మారిందని అందరికి తెలిసిందే.ఇప్పుడు ఈ కొత్త బ్రిటన్ కరోనా అమెరికాలో వేళ్ళూరు కుంటోందని పౌచీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అమెరికాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పలు ఆందోళనకరమైన విషయాలు వెల్లడించారు.ప్రస్తుతం అమెరికాలో బ్రిటన్ కరోనా మెల్ల మెల్లగా వృద్ది చెందుతోందని, త్వరలో అంటే ఏప్రియల్ నాటికి ఈ కొత్త కరోనా మహమ్మారి తీవ్ర రూపం దాల్చనుందని హెచ్చరించారు.

అమెరికన్స్ అందరూ అప్రమత్తంగా ఉండాలని పౌచీ సూచించారు.ఇప్పటికే సుమారు 28 రాష్ట్రాలకు ఈ మహమ్మారి పాకిందని, దాదాపు 315 మంది ఈ మహమ్మారి బారిన పడ్డారని అన్నారు.

ప్రస్తుతం అన్ని రాష్ట్రాలలో కరోన వ్యాక్సిన్ అందుబాటులో ఉందని అమెరికన్స్ అందరూ ఈ అవకాశం వినియోగించుకోవాలని సూచించారు.

హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?
Advertisement

తాజా వార్తలు