అమెరికాలో మరో కాల్పుల ఘటన...పక్కా వ్యుహమేనా..??

అగ్ర రాజ్యం అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు అమెరికన్స్ లో ఆందోళనలు కలిగిస్తున్నాయి.

కేవలం వారం వ్యవధిలోనే మూడు సార్లు తుపాకుల తూటాలకు అమాయకపు ప్రజలు బలై పోవడంతో భవిష్యత్తులో మరిన్ని దాడులు జరుగుతాయా అనే సందేహాలు అందరిలో నెలకొన్నాయి.

కొన్ని రోజుల క్రితం ఇండియానా కొరియర్ సంస్థ లో జరిగిన దాడి ఘటన మరువక ముందే రెండు రోజుల క్రితం ఒమహా లోని వెస్ట్ రోడ్ లో ఉన్న ఓ మాల్ లోకి ప్రవేశించిన ఆగంతకుడు కాల్పులకు తెగబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా పలువురు గాయపడ్డారు.కాగా నిన్నటి రోజున అమెరికాలో మరో కాల్పుల ఘటన చోటు చేసుకుంది.

వాషింగ్టన్ లోని కెనోషా కౌంటీ లో జరిగిన కాల్పులలో ముగ్గురు మృతి చెందగా నలుగురుకి తీవ్ర గాయాలు అయ్యాయి.ఈ ఘటన కూడా స్థానికంగా అలజడి సృష్టించింది.

ఈ ఘటనపై పోలీసులు అందించిన సమాచారం ప్రకారం.దాడికి పాల్పడిన నిందితుడు బార్ లో కూర్చున్నాడని, అతడి దురుసు ప్రవర్తన కారణంగా అక్కడి పలువురు బార్ యాజమాన్యానికి ఫిర్యాదు చేయడంతో వారు అతడిని బయటకు పంపేశారని దాంతో అవమానంగా భావించిన అతడు కొంత సేపటికి తుపాకితో బార్ లోకి వచ్చాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

Advertisement

అతడు వస్తూనే ముందుగా ఎవరికీ చంపాలో నిర్ణయించుకుని వారిపైనే కాల్పులు జరిపినట్టుగా ఉందని, అతడిని అడ్డుకోబోయిన వారిపై కూడా కాల్పులు జరిపాడని వారి తీవ్ర గాయాల పాలయినట్టుగా పోలీసులు తెలిపారు.ఈ ఘటన జరిగిన వెంటనే అతడు పారిపోయాడని సిసి పుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించామని , అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు.

అయితే అమెరికాలో వరుసగా జరుగుతున్న కాల్పుల ఘటనలపై అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు నిపుణులు.ఏదో ఒక రకంగా అలజడి కలిగించి ప్రభుత్వంపై ఒత్తిడి కలిగించేలా ఈ కాల్పుల ఘటనలు ఉన్నాయని, ఒకటి రెండు సంఘటనలు మినహా మిగిలిన సంఘటనలపై ఎన్నో అనుమానాలు కలుగుతున్నాయని వ్యుహత్మకంగానే దాడులు జరుగుతున్నాయనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు