ఏపీలోని అధికార పార్టీగా ఉన్న వైసీపీలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే ముగ్గురు మంత్రుల సీట్లను ఆ పార్టీ అధినేత, సీఎం జగన్ మార్చిన సంగతి తెలిసిందే.
తాజాగా మరో మంత్రి సీటును కూడా సీఎం జగన్ ను మార్చినట్లు తెలుస్తోంది.ఇప్పటికే పదకొండు నియోజకవర్గాల్లో కొత్త సమన్వయకర్తలను మార్చిన జగన్ ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాకు చెందిన కొందరు ఎమ్మెల్యేలపై దృష్టి పెట్టారు.
ఈ మేరకు ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలతో ఆయన కీలక సమావేశం నిర్వహించారు.ఈ నేపథ్యంలో తాడేపల్లిలో ఐదుగురు ఎమ్మెల్యేలతో వేర్వేరుగా భేటీ అయ్యారు.
అయితే వీరిలో కొందరు ఎమ్మెల్యేలకు టికెట్ రాదని, మరి కొందరు ఎమ్మెల్యేలకు స్థానచలనం తప్పదని తెలుస్తోంది.ఈ క్రమంలోనే మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ సెగ్మెంట్ మార్చిన సీఎం జగన్ రాజమండ్రి రూరల్ నుంచి వేణు పోటీచేయాలని ఆదేశించారని సమాచారం.