నాని హిట్3 సినిమాలో మరో స్టార్ హీరో కనిపించనున్నారా.. అసలేం జరిగిందంటే?

టాలీవుడ్ హీరో నాచురల్ స్టార్ నాని( Natural Star Nani ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

నాని ప్రస్తుతం ఒకవైపు సినిమాలను నిర్మిస్తూనే మరొకవైపు హీరోగా సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.

అలాగే నాని హీరోగా నటిస్తున్న సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ గా నిలుస్తున్నాయి.ఇక ఆయన రీసెంట్గా నిర్మాతగా వ్యవహరించిన సినిమా కోర్ట్.

భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.ఈ సినిమాతో బాగానే సక్సెస్ను అందుకున్నారు నాని.

ఒక రకంగా చెప్పాలంటే నాని చాలా తెలివైన మేకర్ అని చెప్పాలి.ఎందుకంటే తన సినిమాను ఎలా టార్గెట్ రీచ్ చేసుకోవాలో నానికి బాగా తెలుసు.

Another Hero In Hit 3 Movie Details, Nani, Hit 3, Hit 3 Movie, Tollywood, Anothe
Advertisement
Another Hero In Hit 3 Movie Details, Nani, Hit 3, Hit 3 Movie, Tollywood, Anothe

అలానే ఇప్పుడు హిట్ సిరీస్ ను చాలా ప్లాన్డ్ గా చేసుకుంటూ వెళ్తున్నారు.హిట్ వన్, టూ సినిమాలు జనాలకు రీచ్ అయ్యాయి.అయితే ఇప్పుడు మూడో భాగంలో నాని చేస్తున్నారు.

అంత వరకు అందరికీ తెలిసిందే.హిట్ యూనివర్స్ అనే మాదిరిగా మూడో భాగంలో నానితో పాటు అడవి శేష్ కూడా కనిపిస్తారట.

విశ్వక్ సేన్ కనిపించరు కానీ రిఫరెన్స్ వుంటుందట.కాగా ఇవన్నీ హిట్ 3 విడుదలకు, మార్కెటింగ్ కు అవసరమైన క్రేజీ పాయింట్లు.

నాని అక్కడితో ఊరుకోలేదు.హిట్ 3( Hit 3 ) కి మరో క్రేజీ పాయింట్ యాడ్ చేస్తున్నారు.

శ‌రీరంలో ఫోలిక్ యాసిడ్ లోపిస్తే..ఏ స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా?

మరో భాషకు చెందిన ఒక క్రేజీ హీరోను తీసుకువచ్చి హిట్ 3 కి జోడిస్తున్నారట.

Another Hero In Hit 3 Movie Details, Nani, Hit 3, Hit 3 Movie, Tollywood, Anothe
Advertisement

ఈ పాయింట్ తో సినిమా వేరే లెవెల్ కు చేరుతుందని తెలుస్తోంది.ఈ పరభాష హీరో కి బోలెడు క్రేజ్ వుందట.ఇప్పుడు ఈ సినిమా కోసం అతన్ని తీసుకున్నారట.

ఒకవేళ హిట్ 4 తీస్తే అదే హీరో ను మెయిన్ లీడ్ గా తీసుకున్నా ఆశ్చర్యం లేదు.అలాగే ఈ సమ్మర్ లో హిట్ సినిమా పెద్ద క్రేజీ అట్రాక్షన్ గా మారబోతోంది.

మే 1 న ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోందట.అయితే ఇప్పుడు ఆ స్టార్ హీరో ఎవరు అన్నది ఇప్పుడు తెలియాల్సి ఉంది.

ఈ వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.ఈ వార్త ప్రస్తుతం ఈ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది.

తాజా వార్తలు