దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఈ కేసులో తాజాగా మరొకరిని అధికారులు అరెస్ట్ చేశారు.
ప్రముఖ వ్యాపార వేత్త అమిత్ అరోరాను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో అమిత్ అరోరాను అదుపులోకి తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో మధ్యాహ్నం అరోరాను ఈడీ అధికారులు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.లిక్కర్ స్కాంలో లిక్కర్ కంపెనీల నుంచి ప్రభుత్వ అధికారులకు ముడుపులు చెల్లించారన్న ఆరోపణలపై అమిత్ అరోరాను అరెస్ట్ చేశారని సమాచారం.
కాగా ఈ కేసులో ఇప్పటివరకు ఆరుగురు అరెస్ట్ అయ్యారు.