జయలలిత( Jayalalithaa ) మరణం తర్వాత తమిళనాడులో( Tamil Nadu ) ఏర్పడిన రాజకీయ సంక్షోభాన్ని తమ కనుకూలంగా మార్చుకోవడానికి అనేక ఎత్తులకు పాల్పడిన బిజెపి ఎట్టకేలకు అన్నాడీఎంకే పార్టీని తన మిత్రపక్షంగా మార్చుకొని రాజకీయాన్ని కొనసాగించింది.సరైన నాయకత్వం లేకపోవడంతో ఏర్పడిన రాజకీయ శూన్యత ను తాను భర్తీ చేసి తనకంటూ ఒక స్ట్రాంగ్ ఓటు బ్యాంకును తమిళ నాడు లో ఏర్పాటు చేసుకోవాలని దూకుడైన రాజకీయాలకు తెరతీసింది .
ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై కు బాజాపా ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం తో ఆయన తనదైన వ్యూహాత్మక ఎత్తుగడలతో అధికార పక్షాన్ని ఇరుకున పెడుతున్నారు.అధికార డిఎంకే( DMK ) నేతల అవినీతి పై పోరాటం చేస్తూ కొంత మంది నేతలను జైలుకు కూడా వెల్లెలా చేశాడు .
సనాతన ధర్మంపై స్టాలిన్ ( Stalin )చేసిన వ్యాఖ్యలను దేశవ్యాప్తంగాచర్చనీయాంశం గా మార్చిన బిజెపి అధికార స్టాలిన్ ప్రభుత్వం ఆత్మ రక్షణలో పడేటట్లుగా చేయగలిగింది.అంతేకాకుండా హిందువులకు ఇండియా కూటమి వ్యతిరేకమని ప్రచారం చేయటం ప్రారంభించింది.ఇదే ఊపులో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నా డీఎంకే అధ్యక్షురాలు జయలలిత మరియు ఆ పార్టీ ఐకానిక్ సింబల్ అయిన అన్నాదురై( Annadurai ) పై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో అన్నాడీఎంకే ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది .అంతేకాకుండా తన రాజకీయ ప్రయోజనాల కోసం అన్న డీఎంకే ను విచ్ఛిన్నం చేయడానికి చూస్తున్న భాజపా ఎత్తులను గమనిస్తున్న అన్నాడీఎంకే నాయకులు భాజపాను వదిలించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని గుర్తించినట్లుగా తెలుస్తుంది.దాంతో ఆ పార్టీ జనరల్ సెక్రటరీ మునుస్వామి( Party General Secretary Munuswamy ) భాజపాతో తెగ తెంపుల ప్రకటన చేయగానే రాష్ట్రవ్యాప్తంగా అన్నా డీఎంకే శ్రేణులు టపాసులు పేల్చుకొని మిఠాయిలు పంచుకున్నారు .ద్రవిడ సిద్ధాంతాలకు అనుగుణంగా రాజకీయాలు చేసే తమిళనాడులో ఉత్తరాది నాయకుల పెత్తనం చెల్లదని మరో మారు నిరూపించినట్లయ్యింది >