వింట‌ర్‌లో ఖ‌చ్చితంగా తినాల్సిన డ్రై ఫ్రూట్ ఏదో తెలుసా?

ప్ర‌స్తుతం వింట‌ర్ సీజ‌న్ కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే.

మిగిలిన సీజ‌న్ల‌తో పోలిస్తే ఈ వింట‌ర్‌లో ఆరోగ్య స‌మ‌స్య‌లు, చ‌ర్మ స‌మ‌స్య‌లు మ‌రియు జుట్టు స‌మ‌స్య‌లు మూడే కాస్త ఎక్కువ‌గానే ఉంటాయి.

వీట‌న్నిటి నుంచీ త‌ప్పించుకుని త‌మ‌ను తాము ర‌క్షించుకోవాల‌నుకుంటే గ‌నుక ఖ‌చ్చితంగా త‌మ డైట్‌లో కొన్ని కొన్ని ఆహారాల‌ను చేర్చుకోవాల్సి ఉంటుంది.అటువంటి వాటిల్లో అంజీర్ డ్రై ఫ్రూట్ ఒక‌టి.

అవును.ఈ సీజ‌న్‌లో ప్ర‌తి రోజు అంజీర్ డ్రై ఫ్రూట్‌ను తీసుకోవాలి.

మ‌రి ఎందుకు దీనిని త‌ప్ప‌ని సరిగా తీసుకోవాలి.? అస‌లు వింట‌ర్‌లో అంజీర్ డ్రై ఫ్రూట్ అందించే ప్ర‌యోజ‌నాలు ఏంటీ.? వంటి విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.సాధార‌ణంగా వింట‌ర్‌లో చాలా మంది బ‌రువు పెరుగుతుంటారు.

Advertisement

అయితే అంజీర్ డ్రై ఫ్రూట్‌ను రెగ్యుల‌ర్ గా రెండు నుంచి నాలుగు చొప్పున తీసుకుంటే శరీరంలో కొవ్వు పేరుకోకుండా ఉంటుంది.ఫ‌లితంగా బ‌రువు అదుపులో ఉంటుంది.అలాగే కొంద‌రు ఈ సీజ‌న్‌లో చ‌లిని త‌ట్టుకోలేక తెగ ఇబ్బంది పడి పోతుంటారు.

అయితే అలాంటి వారు రెండు లేదా మూడు అంజీర్ డ్రై ఫ్రూట్స్‌ను మెత్త‌గా పేస్ట్ చేసి ఒక గ్లాస్ గోరు వెచ్చ‌టి పాల‌ల్లో మిక్స్ చేసుకుని సేవించాలి.ఇలా ప్ర‌తి రోజూ చేస్తే గ‌నుక శ‌రీరంలో వేడి పెరిగి చ‌లిని త‌ట్టుకునే శ‌క్తి ల‌భిస్తుంది.

ఇత‌ర సీజ‌న్ల‌తో పోలిస్తే చ‌లి కాలంలో కీళ్ల నొప్పులు, కండ‌రాలు ప‌ట్టేయ‌డం వంటి స‌మ‌స్య‌లు ఎక్కువ‌గానే ఉంటాయి.అయితే రోజూ అంజీర్ డ్రై ఫ్రూట్స్‌ను తీసుకుంటే ఎమ‌ుక‌లు, కండ‌రాలు బ‌లంగా మారతాయి.దాంతో ఆయా స‌మ‌స్య‌లు త‌గ్గు ముఖం ప‌డ‌తాయి.

చ‌లి కాలంలో అంజీర్ డ్రై ఫ్రూట్స్‌ను రెగ్యుల‌ర్ డైట్‌లో చేర్చుకోవ‌డం వ‌ల్ల చెడు కొలెస్ట్రాల్ కరిగి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.దాంతో గుండె పోటు, ఇత‌ర గుండె సంబంధిత జ‌బ్బులు వ‌చ్చే రిస్క్ త‌గ్గుతుంది.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

అంతే కాదండోయ్‌.వింట‌ర్ సీజ‌న్‌లో వేధించే చ‌ర్మ మ‌రియు జుట్టు సంబంధిత స‌మ‌స్య‌ల నుంచి అంజీర్ డ్రై ఫ్రూట్స్ ఉప‌శ‌మ‌నాన్ని అందిస్తాయి.

Advertisement

తాజా వార్తలు