షారుఖ్ ఖాన్, సిద్ధార్థ్ ఆనంద్ కాంబోలో వచ్చిన సినిమా పఠాన్. ఎన్నో భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమాతో మళ్లీ తిరిగి షారుఖ్ ఫాం లోకి వచ్చాడు.
బాద్షా హిట్ కొట్టి చాలా ఏళ్లు అవుతుండగా ఈసారి పఠాన్ సినిమా ఆయన కోసమైనా హిట్ చేసేద్దాం అన్నట్టు ఉన్నారు ఆడియన్స్.పఠాన్ సినిమాని అటు బాలీవుడ్ హీరోలు కూడా ప్రమోట్ చేస్తున్నారు.
షారుఖ్ సినిమాను యూనిట్ అంతటితో కలిసి చూశారు యానిమల్ టీం.రణ్ బీర్ కపూర్, రష్మిక కలిసి నటిస్తున్న ఈ సినిమాను సందీప్ వంగ డైరెక్ట్ చేస్తున్నారు.

యానిమల్ టీం అంతా కలిసి పఠాన్ సినిమా చూశాం అంటూ రష్మిక తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.యానిమల్ సినిమాతో మరోసారి సందీప్ వంగ తన మ్యాడ్ నెస్ ని చూపించనున్నారు.ఆల్రెడీ ఈమధ్య రిలీజైన పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచింది.రణ్ బీర్ కపూర్ కి యానిమల్ రూపం లో మరో హిట్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడు సందీప్ వంగ.బ్రహ్మాస్త్ర సినిమాతో సౌత్ ఆడియన్స్ ని కూడా అలరించిన రణ్ బీర్ యానిమల్ తో పాన్ ఇండియా హిట్ కొట్టాలని చూస్తున్నాడు.
