దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటాయి.ఈ వేడి నుంచి ఉపశమనానికి కూలర్లు, ఏసీలను వినియోగిస్తున్నారు.అయితే ఎండల్లో జంతువులు మలమల మాడిపోతున్నాయి.వాటి సంక్షణ చూసేవారే లేరు.అయితే మహారాష్ట్రలోని వాషిమ్‌లోని ఉమ్రా గ్రామంలో నివసిస్తున్న ప్రవీణ్ కాలేకు 13 పాడి గేదెలు ఉన్నాయి.గత కొద్ది రోజులుగా విదర్భలో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటడంతో ఈ ఉష్ణోగ్రత ప్రభావం ప్రవీణ్ కాలే పాడిగేదెలపై పడి గేదెలు పాలు ఇవ్వడం మానేశాయి.
దీంతో ఈ రైతు పాల వ్యాపారం దెబ్బతింది.ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు ఓ ఉపాయం ఆలోచించిన రైతు.మోటార్ సాయంతోటేబుల్‌పై 6 ఫాగర్లను అమర్చి పైపు సాయంతో వాటిని కనెక్ట్ చేసి, ఫాగర్‌కు అనుసంధానం చేసిన పైపును వాటర్ ట్యాంక్‌లో పెట్టాడు.ఇక్కడి నుంచి పాడి గేదెలకు షవర్ ఏర్పాటయ్యింది.
పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో పాటు లోడ్ షెడ్డింగ్‌తో ఇబ్బందులు తలెత్తాయి.అలాంటి పరిస్థితుల్లో సోలార్ పవర్ ప్లేట్ సహాయంతో ఫౌంటెన్‌కు కనెక్ట్ చేశారు.
రైతు కష్టానికి ఫలితం దక్కింది.గేదెలకు అత్యధిక ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం లభించింది, ప్రవీణ్ ముఖంలో ఆనందం తాండవించింది.ప్రవీణ్ కాలే ఈ ప్రయోగానికి రూ.5 వేలు ఖర్చు చేశాడు.







