సందీప్ రెడ్డి వంగా( Sandeep Reddy Vanga ) దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్, రష్మిక మందన కలిసి నటించిన తాజా చిత్రం యానిమల్( Animal )ఈ సినిమా రేపు అనగా డిసెంబర్ 1న పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కానుంది.ఈ సినిమా కోసం బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు టాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ లో భాగంగా తెలుగులో ఈ సినిమా రికార్డులు సృష్టిస్తోంది.ఎన్నడూ లేనంతగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ వస్తున్నాయి.
ఇక ఈ సినిమా సెన్సార్ కూడా పూర్తయిన విషయం తెలిసిందే.
అయితే సెన్సార్ బోర్డు సభ్యులు( Censor board ) ఈ సినిమాలో ఐదు కట్స్ చెప్పారని, అలాగే ఒక ఇంటిమేట్ సన్నివేశం కూడా తీసెయ్యమన్నారు అని తెలుస్తోంది.ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయగా ఆ ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది.ఈ సినిమాలో చాలా హింస ఉంటుందట.
ఈ సినిమాకు ఏ సర్టిఫికెట్ కూడా ఇచ్చారు.ఈ మూవ 18 ఏళ్ల లోపు పిల్లలు చూడడానికి పనికిరాదు.
కాగా సెన్సార్ ఈ సినిమాలో ఐదు కట్స్ చెప్పాయట.అలాగే కొన్ని పదాలని పూర్తిగా మార్చేయాలని కూడా చెప్పారట.
అలాగే విజయ్, జోయాల మధ్య వచ్చే ఇంటిమేట్ సన్నివేశాలను మార్పు చెయ్యాలని చెప్పారని తెలిసింది./br>
అలాగే బ్లాక్ కాస్ట్యూమ్ లాంటి పదాలను మార్చాలని కూడా సెన్సార్ బోర్డు చెప్పినట్టుగా ఆ సర్టిఫికెట్ లో చూపిస్తోంది.ఇప్పుడు ఈ సినిమా సెన్సార్ సర్టిఫికెట్ కూడా సాంఘీక మాధ్యమంలో వైరల్ అవుతోంది.ఈ సినిమా మూడు గంటల 23 నిమిషాలు ఉంటుందట.
ఇంత నిడివి వున్న సినిమా ఈమధ్యకాలంలో రాలేదనే చెప్పాలి.అప్పుడెప్పుడో పాత తెలుగు సినిమాలు, హిందీ సినిమాలు ఇంత నిడివిలో వచ్చేవి, ఈమధ్య కాలంలో మాత్రం రాలేదనే చెప్పవచ్చు.