పటాస్, రాజా ది గ్రేట్ చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన దర్శకుడు అనిల్ రావిపూడి.మొదటి సినిమా మొదలుకుని ఆ మధ్య వచ్చిన మహేష్ బాబు యొక్క సరిలేరు నీకెవ్వరు సినిమా వరకు వరుసగా సక్సెస్ లను సొంతం చేసుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి.
ఒక్క ఫ్లాప్ కూడా లేని దర్శకుడు అంటూ పేరు దక్కించుకున్న ఈ దర్శకుడు ఎఫ్ 3 సినిమా తో కాస్త నిరాశ పరిచాడు.భారీ అంచనాల నడుమ విడుదలైన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలవడంతో అనిల్ రావిపూడి క్రేజ్ ఒక్కసారిగా పడిపోయినట్లు అయింది.
ఆయన స్థాయిలో ఆ సినిమా లేదని విమర్శలు వ్యక్తం అయ్యాయి.అయినా కూడా వెంటనే నందమూరి బాలకృష్ణ తో సినిమా చేసే అవకాశాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి సొంతం చేసుకున్నాడు.
ఎఫ్ 3 సినిమా నిరాశ పర్చడం తో దర్శకుడు అనిల్ రావిపూడి యొక్క రెమ్యూనరేషన్ చాలా తగ్గింది అనే ప్రచారం మీడియా సర్కిల్స్ లో జరుగుతోంది.కానీ అసలు విషయం ఏమిటంటే ఎఫ్ 3 సినిమా ఫలితంకు ఏ మాత్రం తగ్గకుండా దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమా కి కూడా మంచి రెమ్యూనరేషన్ అందుకు అంటున్నాడట.

బాలయ్య సినిమా అంటే మినిమం బడ్జెట్ ఉంటుంది.అలాగే మంచి బిజినెస్ కూడా జరుగుతుంది.కనుక ఈ సినిమా విడుదలైన తర్వాత లాభాల్లో వాటా కూడా దర్శకుడు అనిల్ రావిపూడి సొంతం చేసుకోబోతున్నాడు అనే ప్రచారం జరుగుతుంది.ఒక్క సినిమా ఫ్లాప్ తో రెమ్యూనరేషన్ తగ్గడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది.
అనిల్ రావిపూడి కి పారితోషికం భారీగా తగ్గింది అనేది మాత్రం పూర్తిగా అవాస్తవం.

మరో రెండు మూడు సినిమాలు కూడా నిరాశ పరిచితే అప్పుడు దర్శకుడు అనిల్ రావిపూడి పారితోషికం విషయం లో వెనక్కి తగ్గాల్సి ఉంటుందేమో కానీ ఒక సినిమా ఫెయిల్ అయితే రెమ్యూనరేషన్ విషయంలో తగ్గింపు అనేది చాలా రేర్ గా జరుగుతుంది.అనిల్ రావిపూడి కి ఆ ఇబ్బంది ఏమి లేదని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.







