NBK108 షూట్ అప్డేట్.. శ్రీలీల సెట్స్ లో ఎప్పుడు జాయిన్ అవుతుందంటే?

నందమూరి బాలకృష్ణ ప్రెజెంట్ ఫుల్ ఫామ్ లో ఉండడంతో ఆయన సినిమాలపై ఎప్పుడు లేనంతగా హైప్ క్రియేట్ అవుతుంది.అఖండ, వీరసింహారెడ్డి వంటి రెండు హిట్స్ అందుకుని బాలయ్య కెరీర్ లోనే మంచి ఊపులో ఉన్నాడు.

 Anil Ravipudi Balakrishna Nbk108 Movie Latest Update-TeluguStop.com

వీరసింహారెడ్డి తర్వాత బాలయ్య అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.వరుసగా హిట్స్ అందుకుంటూ వస్తున్న అనిల్ రావిపూడి బాలయ్యతో ఎలాంటి కథను తెరకెక్కించ బోతున్నాడో అని ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమా ఇప్పటికే రెగ్యురల్ షూట్ స్టార్ట్ చేసుకుని ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది.ఇక వెంటనే సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేయాలని మేకర్స్ భావించారు.అయితే అనుకోని కారణాల వల్ల షూట్ కు కొద్దీ రోజులు గ్యాప్ వచ్చింది.‘NBK108‘ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ఈ నెలలో స్టార్ట్ చేయనున్నట్టు తెలుస్తుంది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కొత్త షెడ్యూల్ లో శ్రీలీల పాల్గొన బోతున్నట్టు సమాచారం.ఈ సినిమాలో బాలయ్య కూతురు పాత్రలో శ్రీలీల కనిపిస్తున్న విషయం విదితమే.ఈ క్రమంలోనే ఈమె పార్ట్ షూట్ కోసం శ్రీలీల ఈ నెల 9 నుండి జరగనున్న షూట్ లో పాల్గొన బోతుందట.దాదాపు 3 రోజుల పాటు ఈమెపై కీలక సన్నివేశాలను మేకర్స్ తెరకెక్కించనున్నారట.

ఈ సినిమాలో బాలయ్యను పవర్ ఫుల్ రోల్ లో చూపించి అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా అనిల్ రావిపూడి తెరకెక్కించ బోతున్నాడు అని తెలుస్తుంది.ఇదిలా ఉండగా ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ వారు నిర్మిస్తుండగా ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.మరి రెండు హిట్స్ అందుకుని ఫుల్ జోష్ లో ఉన్న బాలయ్య హ్యాట్రిక్ హిట్ సొంతం చేసుకుంటాడో లేదో వేచి చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube