టాలెంటెడ్ డైరెక్టర్లలో అనిల్ రావిపూడి( Anil Ravipudi ) ఒకరు.ఈయన ఇప్పటి వరకు ఒక్క ప్లాప్ కూడా తన కెరీర్ లో అందుకోలేదు అనే చెప్పాలి.
దీంతో ఈయన ఒక్కో సక్సెస్ ఖాతాలో పడుతుండడంతో స్టార్ హీరోల లిస్టులో చేరిపోయాడు.మరి అనిల్ రావిపూడి తన కెరీర్ లో హిట్ అందుకున్న సినిమాల్లో ”రాజా ది గ్రేట్”( Raja the Great ) ఒకటి.
ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.అనిల్ రావిపూడి డైరెక్షన్ లో మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాతో రవితేజ కెరీర్ లో కూడా మరో హిట్ పడింది.
మరి అలాంటి బ్లాక్ బస్టర్ కాంబో మరో సారి రిపీట్ అవుతుంది అని టాక్ గత కొద్దీ రోజులుగా వైరల్ అవుతూనే ఉంది.
ఈ వార్తలపై తాజాగా క్లారిటీ తెలుస్తుంది.
ఈ కాంబో ఆల్మోస్ట్ ఫైనల్ అయినట్టే అనే టాక్ వినిపిస్తుంది.లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం అనిల్ రావిపూడి, రవితేజ( Ravi Teja ) కలిసి మరోసారి పని చేయబోతున్నారు అని ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అవుతుంది.
ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్ మీదకు వచ్చే అవకాశం ఉందట.
ప్రముఖ నిర్మాత దిల్ రాజు( producer Dil Raju ) ఈ సినిమాను నిర్మించనున్నట్టు సమాచారం.అంతేకాదు ఇది రాజా ది గ్రేట్ సినిమాకు సీక్వెల్ అని కూడా అంటున్నారు.మొత్తానికి మరో బ్లాక్ బస్టర్ కాంబో రిపీట్ అవుతుండడంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.
చూడాలి ఈ మూవీ ఎప్పుడు అఫిషియల్ గా అనౌన్స్ అవుతుందో.ఇక ఇటీవలే దసరా బరిలో అనిల్ తెరకెక్కించిన భగవంత్ కేసరి రిలీజ్ అయ్యి హిట్ అందుకుంది.
బాలయ్య, అనిల్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది.దీంతో అనిల్ తన నెక్స్ట్ ఏ సినిమా చేస్తాడా అని అంత ఎదురు చూస్తున్నారు.ఇక మాస్ రాజా అయితే ఇటీవలే టైగర్ నాగేశ్వరరావు సినిమాతో హిట్ కొట్టాడు.ఆ తర్వాతవ్ ప్రజెంట్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.సంక్రాంతికి ”ఈగల్” సినిమాను రెడీగా ఉంచి ఇప్పుడు మరో సినిమా చేస్తున్నాడు.గోపీచంద్ దర్శకత్వంలో నాల్గవ సారి సినిమా తెరకెక్కుతుంది.