సొంతగూటికే కుంభం అనిల్ కూమార్ రెడ్డి.. అసలు కారణమిదేనా ..?

తెలంగాణ ( Telangana ) రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా రాజకీయ పార్టీలలో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి.బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కి, కాంగ్రెస్ నుంచి బిఆర్ఎస్ కి వలసలు విపరీతంగా పెరిగిపోతున్నాయి.

 Anil Kumar Reddy Join To Brs , Anil Kumar Reddy Kumbam , Brs, Ts Politics , Pai-TeluguStop.com

ఇదే తరుణంలో ఈ మధ్యకాలంలో బిఆర్ఎస్ ( BRS ) పార్టీలో చేరినటువంటి యాదాద్రి భువనగిరి డిసిసి మాజీ అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి మళ్లీ సొంత గూటికి చేరుకున్నారు.బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి మళ్లీ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

అయితే రెండు నెలలు కూడా కాకముందే సొంత గూటి కి చేరుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

పార్లమెంటు సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ( Komatireddy Venkata reddy ) తో విభేదాల వల్ల యాదాద్రి భువనగిరి డిసిసి అధ్యక్షుడిగా ఉన్న అనిల్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడిన సంగతి మనందరికీ తెలిసిందే.జూలై 24వ తేదీన సీఎం కేసీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ కండువా కప్పుకున్నారు.ఆయనతోపాటు చాలామంది అనుచరులు కూడా బిఆర్ఎస్ లో చేరారు.

ఇదే తరుణంలో బిఆర్ఎస్ టికెట్ వస్తుందని ఆశపడ్డ కుంభం అనిల్ కుమార్ రెడ్డి అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించిన సమయంలో భువనగిరి నియోజకవర్గం అభ్యర్థిగా ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి ( Pailla shekhar Reddy ) కే మళ్లీ అవకాశం ఇవ్వడంతో, మనస్థాపానికి గురైన కుంభం అనిల్ కుమార్ అసంతృప్తి చెందినట్లు తెలుస్తోంది.అంతేకాకుండా బిఆర్ఎస్ లో తనకు సముచిత స్థానం కల్పించడం లేదని, పట్టించుకునే నాధుడు లేదని తీవ్రమైన మనస్థాపానికి గురైనటువంటి అనిల్ కుమార్ రెడ్డి (Anil Kumar Reddy) మళ్లీ సొంత పార్టీకే వచ్చేసారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube