ఆంధ్రా రొయ్యా.. మజాకా

కరోనా పరిస్థితులు ప్రపంచ దేశాలను తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తూ ఉండగా భారతదేశం వాణిజ్య వ్యాపార ఎగుమతుల్లో  తనదైన సత్తాను చాటుతోంది.

కరోనా లాక్డౌన్ పరిస్థితుల్లోనూ ఆంధ్ర రొయ్యల ధర గణనీయంగా పెరిగింది.

వీటి ధర పెరుగుదల, ప్రభుత్వం విద్యుత్ చార్జీలను సగానికి పైగా తగ్గించడం వెరసి ఆక్వా రైతులకు ఉపశమనం  కలిగిస్తుంది.కేంద్ర ప్రభుత్వం ఎగుమతులను ప్రోత్సహించేందుకు తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి.

Andhra Royya Majaka, Andra , Royya , Fishesh , Exports , Highest Exports , Othe

2020 సంవత్సరానికి సంబంధించి ఎగుమతులపై DGCIS వెల్లడించిన వివరాల ప్రకారం రొయ్యల ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ తన సత్తా చాటుకుంది.ఆంధ్ర నుంచి ప్రపంచంలోని 61 దేశాలకు ఎగుమతి అవుతున్నాయి ఉత్పత్తిలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది.

నాణ్యమైన రుచికరమైన రొయ్యల సాగు చేసుకుంటున్న ఇందుకు కారణమని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ స్టాటిస్టిక్స్ (DGCIS) 2020 లోని నివేదికలు వెల్లడించాయి.రొయ్యల ఎగుమతులు విలువ  రూ.16,183 కోట్లుగా ప్రకటించింది.ఏపీ నుంచి 45 దేశాలకు బియ్యం ఎగుమతి అవుతుండగా వీటి విలువ రూ.3,015.9 కోట్లుగా ఉంది.రొయ్యల తో పాటు ఫెర్రా సిలికాన్, మాంగనీస్ వంటి ఖనిజ సంపద రాష్ట్రం నుంచి 69 దేశాలకు ఎగుమతి అవుతుంది.

Advertisement

పొగాకు క్యాప్సికం వంటివి అధికంగా ఎగుమతి అవుతున్నాట్టు నివేదిక పేర్కొంది.ఇదిలా ఉంటే గుజరాత్ నుంచి 48 దేశాలకు 77,325.1 కోట్ల  విలువైన డీజిల్ ఎగుమతులు జరిగినట్లు తెలిపింది.

Hemamalini Dharmendra : హేమమాలిని పురుడు కోసం మొత్తం హాస్పిటల్ ని బుక్ చేసిన ధర్మేంద్ర
Advertisement

తాజా వార్తలు