Andhra Pradesh : విద్యలో ఫలిస్తున్న ఆంధ్రప్రదేశ్ కృషి !

రాష్ట్రాల్లో పాఠశాల విద్యా ప్రమాణాల్నిఏటేటా కేంద్రం పెర్ఫార్మన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ ద్వారా మదింపు వేస్తుంది.ఫలితాలు,నిర్వహణ తదితర అంశాల్లో 70 సూచీలను ఆధారం చేసుకుని ఇచ్చే రేంకుల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉండడం అభినందనీయం.సూచీల్లో వచ్ఛే పాయింట్స్ ఆధారంగా లెవెల్ 2 పొందిన ఏడు రాష్ర్టాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా నిలవడం గర్వకారణం.2019 కి ముందు లెవెల్ 6 లో ఉన్న రాష్ట్రం గుజరాత్,కేరళ,మహారాష్ట్రలతో సమానంగా ముందు వరుసలోకి రావడం ప్రభుత్వం చేస్తున్న కృషికి తగ్గ ఫలితం.పాఠశాల లో విద్యాప్రమాణాలు పెంచడానికి,సౌకర్యాలు కల్పించడానికి,బోధనలో నాణ్యతను మెరుగుపర్చడానికి ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక శ్రద్ధ చూపెడుతున్నారు.

 Andhra Pradesh's Efforts In Education System , Andhra Pradesh, Ys Jagan, Ycp , E-TeluguStop.com

ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు పెరిగాయి.గతంలో 37 లక్షల మంది పిల్లలు ఎన్రోల్ అయితే ఇప్పుడా సంఖ్య 42 లక్షలకు చేరుకుంది.విద్యాకానుక,అమ్మఒడి, డిజిటల్ క్లాస్ రూమ్ ల అందుబాటు,3వ తరగతి నుండి సబ్జెక్టు టీచర్ల బోధన తదితర విప్లవాత్మక చర్యలతో పేద పిల్లలకు నాణ్యమైన విద్య అందుతుంది.

తెలుగు,ఇంగ్లిష్ లో పాఠ్యపుస్తకాలు అందించడం వల్ల విద్యార్థులకు రెండు భాషలూ అలవడతాయి.వీటితో బాటు విద్యార్థి శారీరక ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మధ్యాహ్న భోజనం లో పోషక పదార్ధాలుండేలా మెనూ అమలు చేయడం విశేషం.

విద్యపై ఇదే రకమైన శ్రద్ధతో రాష్ట్రం త్వరలోనే నెంబర్ వన్ స్థానానికి చేరుకోవాలి.విద్య అత్యుత్తమమైన సామాజిక పెట్టుబడి.

దానిపైన పెట్టే ఖర్చు వృధా పోదు.తిరిగి విలువైన మానవ వనరులు అందించడం ద్వారా రెట్టింపు రాబడి అందిస్తుంది.

విద్యా,వైద్య రంగాలకు ప్రాముఖ్యతనిస్తున్న ప్రభుత్వానికి ధన్యవాదములు.అయితే భాద్యత ఇంకా చాలా మిగిలే ఉంది.

Telugu Andhra Pradesh, System, English Medium, Gujarat, Kerala, Maharashtra, Ys

ఇప్పటికీ స్కూల్ మొహం చూడని పేదపిల్లల సంఖ్య,పౌష్టికాహార లేమితో ఉన్న పిల్లల సంఖ్య గణనీయమే.వారందరి దగ్గరకూ సౌకర్యాలు చేరినప్పుడే నెరవేర్చాల్సిన భాద్యత పూర్తవుతుంది.ఆ దిశగానే వేగంగా అడుగులు వేస్తున్న ప్రభుత్వానికి,అందుకు నాయకత్వం వహిస్తోన్న ముఖ్యమంత్రి గారికి మద్దతు పలకాల్సిన అవసరం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube