అటు నుంచి ఇటు ... ఇటు నుంచి అటు ! ఏపీలో గోపీల సందడి

ఎన్నికల సమయం దగ్గరికి వచ్చింది అంటే చాలు గోపి (గోడ మీద పిల్లులు)ల సందడి ఎక్కువగా కనిపిస్తుంది ఈ పార్టీ నుంచి ఆ పార్టీ లోకి… ఆ పార్టీ నుంచి ఈ పార్టీ లోకి ఎక్కడ సీటు దొరికితే అక్కడికి నాయకులు జంపింగ్ చేస్తుంటారు.తమకు అనుకూలమైన అవకాశం దొరికే పార్టీల కోసం గోడమీద పిల్లి ఎదురు చూస్తూ ఉంటారు.

 Andhra Pradesh Parties Leaders Shuffling In All Parities-TeluguStop.com

నాయకులంతా ఇప్పుడు ఏ పార్టీలో చేరితే తమకు ఎక్కువ లాభం ఉంటుందని లెక్కల్లో మునిగితేలుతుంటారు.పార్టీలు కూడా తమకు రాజకీయంగా ఉపయోగపడే బలమైన అభ్యర్థులు కోసం వెతుకుతూ ఉంటాయి.

పక్క పార్టీలో బలమైన నాయకులు ఉంటే వారితో బేరసారాలకు దిగుతుంటారు.అధికారంలోకి వచ్చాక కీలకమైన పదవులు ఇస్తామని హామీ ఇస్తూ … ఏదో రకంగా నాయకులను పార్టీలో చేర్చుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తుంటారు.

ప్రస్తుతం అధికార పార్టీ తెలుగుదేశం లో సందడి ఎక్కువగా కనిపిస్తోంది.

తాజాగా కడప జిల్లాకు చెందిన మాజీ మంత్రి గురువారం చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరిపోయారు.బలమైన నాయకుడు గుర్తింపు పొందిన ఈయన కడప జిల్లా లో సీనియర్ నాయకుడిగా గుర్తింపు పొందారు.జిల్లా రాజకీయాల్లో ప్రభావం చూపించగల నాయకుడు.

వాస్తవానికి ఈయన వైఎస్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడిగా పేరుపొందారు.అలాగే వైసీపీలో కీలకంగా ఉన్న కొణతాల రామకృష్ణ, సబ్బం హరి వంటి నాయకులు కూడా ఆ పార్టీ నుంచి బయటకి వచ్చేశారు.

అయితే వారికి టిడిపి వేసిన గాలం వర్కౌట్ అవ్వడంతో …రేపు రేపోమాపో పసుపు కండవ వేసుకునేందుకు సిద్ధమయ్యారు.అంతే కాదు దాదాపు వైసిపిలో చేరడం ఖాయం అనుకున్న విష్ణుకుమార్ రాజు కూడా టిడిపి గూటికి చేరేందుకు సిద్ధంగా ఉన్నాడు.

అలాగే ఇదే పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉంటూ… వైసీపీలో చేరిన దాడి వీరభద్రరావు కూడా తిరిగి సొంత గూటికి చేరేందుకు సిద్ధంగా ఉన్నాడు.

అలాగే… టిడిపిలో టిక్కెట్ ఆశించి అక్కడ సీటు దక్కే అవకాశం లేదనుకున్న వారు … సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఈ దఫా తమకు సీటు దక్కదని ఫిక్స్ అయిపోయిన నాయకులు సైతం వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు.ఈ కోవలో రాజంపేట ఎమ్మెల్యే మేడ మల్లికార్జున రెడ్డి వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యాడు.అయితే ఇది గమనించిన బాబు ముందుగానే అతన్ని బుజ్జగించడంతో ఆగిపోయాడు.

ఇక వీరేకాక టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో చాలామంది తమకు సీటు హామీ ఇస్తే వైసీపీలో చేరడానికి సిద్ధమంటూ జగన్ కు సంకేతాలు పంపుతున్నారు.ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జనసేన లోకి వెళ్లేందుకు కూడా కొంతమంది వైసీపీ, టిడిపి నాయకులు ఆ పార్టీ నాయకులతో చర్చలు జరుపుతున్నారు.

మొదట పవన్ పార్టీలో అంతా కొత్త ముఖాలు అనుకున్నప్పటికీ ఆ ఫార్ములా వర్కౌట్ అయ్యేలా కనిపించకపోవడంతో… పక్క పార్టీ నేతలకు జనసేన నుంచి ఆహ్వానాలు అందుతున్నాయి.ఈ క్రమంలో పార్టీలు మారే వారు ఈ మూడు పార్టీలు ఏ పార్టీ బెటర్ గా ఉందని లెక్కల్లో మునిగి తేలుతున్నారు.

ఈ రెండు మూడు నెలలు గోపిల సందడి ఏపీలో ఎక్కువగానే కనిపించబోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube