ఆడబిడ్డల తల్లిదండ్రులకు ముఖ్యమంత్రి జగన్ వరాల జల్లు..ఏకంగా 350 కోట్లు విడుదల!

ఆంధ్ర ప్రదేశ్ లో సంక్షేమ పథకాలకు పెట్టింది పేరు లాంటి వాడు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి.

( YS Jagan Mohan Reddy ) తండ్రి రాజశేఖర్ రెడ్డి హయాం లో ఎలాంటి సంక్షేమ పధకాలు నడిచేవో, సాధ్యమైనంత మేరకు తన హయాం లో కూడా అదే స్థాయి లో సంక్షేమ పధకాలను అమలు చెయ్యడానికి జగన్ విశ్వ ప్రయత్నాలు చేసాడు.

కానీ కరోనా మహమ్మారి రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ ని చాలా ఘోరంగా దెబ్బ తీసింది.దీంతో ప్రభుత్వం అప్పులో కూరుకుపోయింది.

ఇప్పటి వరకు దాదాపుగా 10 లక్షల కోట్ల రూపాయిల అప్పు మన ప్రభుత్వానికి ఉందట.అత్యధిక అప్పులు తీసుకున్న రాష్ట్రాల జాబితాలో మన ఆంధ్ర ప్రదేశ్ నెంబర్ 1 స్థానం లో ఉంటుంది అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదనుకుంటా.

ఆ స్థాయి పరిస్థితులు ఏర్పడ్డాయని వైసీపీ నాయకులూ అంటున్నారు.ఇదంతా పక్కన పెడితే వైసీపీ ప్రభుత్వం చేపట్టిన బృహత్తర కార్యక్రమాల్లో ఒకటి షాదీ ముబారక్.

Andhra Pradesh Government Released ₹81.64 Crore Towards The Ysr Kalyanamasthu
Advertisement
Andhra Pradesh Government Released ₹81.64 Crore Towards The YSR Kalyanamasthu

నిరుపేద కుటుంబాలు తమ ఆడబిడ్డకు పెళ్లి చేసి పంపిన తర్వాత ఆ ఆడ బిడ్డ తల్లిదండ్రులకు ఎలాంటి ఆర్ధిక సమస్యలు ఉండకూడదు అనే గొప్ప ఉద్దేశ్యం తో కల్యాణ మస్తు( YSR Kalyanamasthu ) మరియు షాదీ ముబారక్ పధకాలను ప్రవేశ పెట్టమని జగన్ చెప్పుకొచ్చారు.జులై , ఆగస్టు మరియు సెప్టెంబర్ నెలలలో పెళ్లి చేసుకున్న జంటల కుటుంబాలకు జగన్ తాడేపల్లి ఆఫీస్ నుండి 81 కోట్ల రూపాయిల నిధులను బటన్ నొక్కి విడుదల చేసాడు.ఈ త్రైమాసికం లో 10,511 జంటలకు ఈ 81 కోట్ల రూపాయిలను విడుదల చేశామని, అలా ఇప్పటి వరకు మూడు త్రైమాసికాలకు కలిపి 46,000 జంటల పెళ్లిళ్లకు 350 కోట్ల రూపాయిల నిధులను విడుదల చేశామని, గతం లో టీడీపీ( TDP ) హయం లో 2018 వ సంవత్సరం వరకు ఎదో మొక్కుబడిగా కొంత డబ్బులిచ్చి మళ్ళీ ఆపేశారని, కానీ మా ప్రభుత్వం అలా కాదంటూ జగన్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.

Andhra Pradesh Government Released ₹81.64 Crore Towards The Ysr Kalyanamasthu

ఈ స్కీం కి అర్హత సంపాదించాలంటే 18 సంవత్సరాలు నిండి, కచ్చితంగా పదవ తరగతి సర్టిఫికెట్ ఉండాలి, అలా ఉన్న వారికే ఈ స్కీం ని అమలు చేసాము అంటూ జగన్ చెప్పుకొచ్చాడు.దీనివల్ల తల్లితండ్రులు కచ్చితంగా తమ కూతుర్లను పదవ తరగతి వరకు కచ్చితంగా చదివిస్తారని, ఈ స్కీం వల్ల బాల్య వివాహాలు చాలా వరకు తగ్గిపోయాయి అంటూ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు జగన్.ఇదేదో ఎన్నికల్లో ఓట్ల కోసం చేస్తున్న స్కీం కాదని, నిజాయితితో నడుపుతున్న స్కీం అంటూ జగన్ చెప్పుకొచ్చాడు.

Advertisement

తాజా వార్తలు