చంద్రబాబు అరెస్ట్( Chandrababu Arrest ) తర్వాత జాతీయ స్థాయిలో ఈ విషయాల చర్చనీయాంశం గా మార్చడానికి మరియు కీలకమైన న్యాయ కోవిదులతో చర్చించడానికంటూ హస్తిన కు పయనమయిన లోకేష్ ఇప్పటివరకు తిరిగి ఆంధ్రప్రదేశ్ కు రాలేదు.రాజకీయంగా కేంద్ర పెద్దలను కలిసి ఈ విషయంపై చర్చిస్తున్నారా అంటే ఇంతవరకు ఆయనకు భాజపా పెద్దలతో ఎటువంటి అపాయింట్మెంట్ దొరికిన దాఖలా లేదు.
జాతీయ మీడియా కూడా పెద్ద గా బాబు వ్యవహారాన్ని పట్టించుకోలేదు.మరోవైపు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని లోకేష్ అరెస్టు భయంతోనే ఢిల్లీలో దాకున్నాడని ఆంధ్రప్రదేశ్ అధికార పక్ష నేతలు, కార్యకర్తలు వ్యాఖ్యానిస్తున్నారు.

సోషల్ మీడియాలో వైసీపీ సోషల్ మీడియా( YCP Social Media ) వింగ్ లోకేష్ ను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తుంది.అయితే అరెస్టుకు తాను భయపడటం లేదని నిజంగా కేసులో సరైన సాక్షాదారాలు ఉంటే ఢిల్లీకి వచ్చి కూడా అరెస్టు చేసుకోవచ్చు కదా అంటూ లోకేష్( Nara Lokesh ) కౌంటర్ ఇచ్చినప్పటికీ మరి లోకేష్ ఢిల్లీలో ఎందుకు ఉన్నాడు అన్నదానిపై తెలుగుదేశం( Telugu Desam Party ) నుంచి ఇదమిత్తంగా సరైన సమాధానం రావడం లేదు.న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారా అంటే ఇప్పటికే ఈ కేసులో దేశవ్యాప్తంగా పేరు ఉన్న న్యాయవాదులు వాదిస్తున్నారు.దాంతో లోకేష్ అక్కడ చక్కబడుతున్న వ్యవహారాలు ఏమిటంటూ అధికార పక్షం అడుగుతున్న ప్రశ్నలకు తెలుగుదేశం నాయకత్వం వద్ద సరైన సమాధానాలు లేవు.
ఒక పక్క చంద్రబాబు అరెస్టుతో డీలా పడిన శ్రేణులను ఉత్తేజితం చేసి రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలకు, నిరసనలకు న్యాయకత్వం వహించాల్సిన లోకేష్ ఆ బాధ్యతలను భార్య బ్రాహ్మణి కి తల్లి భువనేశ్వరి కి వదిలి నిష్క్రియా పరుడై నిలబడిపోయాడన్న అపవాదను లోకేష్ మోయాల్సి వస్తుంది.

అయితే రాజకీయ యుద్ధంలో వ్యూహాత్మకంగానే వ్యవహరించాలని ముఖ్యంగా పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు ఆచితూచి స్పందించాలని ఆ కారణంతోనే లోకేష్ సరైన సమయం కోసం వేచి చూస్తున్నారు తప్ప అరెస్టుకు భయపడి కాదంటూ తెలుగుదేశం హార్డ్ కోర్ ఫ్యాన్స్ వ్యాఖ్యానిస్తున్నారు.మరో కోణం చూస్తే ఎట్టకేలకు సిఐడి అధికారులు లోకేష్ కు 41 ఏ నోటీసులు అందజేశారు.అక్టోబర్ 4వ తారీఖున ఉదయం 10 గంటలకు తమ కార్యాలయంలో విచారణకు హాజరు అవ్వాలని లోకేష్ ను కోరారు .మంగళగిరిలోని ఇన్నర్ రింగ్ రోడ్డు అవకతవకలతో పాటు హెరిటేజ్ సంస్థ( Heritage )కు సంబంధించిన ఆర్థిక లావాదేవీల పై కూడా ప్రశ్నల పై నోటిస్ అందించినట్లుగా తెలుస్తుంది దీనిపై లోకేష్ న్యాయ నిపుణుల తో సంప్రదింపులు చేస్తున్నారట.