ఇండస్ట్రీకి చెందిన వాళ్లలో ఏదైనా తేడా కనిపిస్తే చాలు వెంటనే నెటిజన్స్ వారిపై కామెంట్లు చేయటం కానీ సలహాలు ఇవ్వడం కానీ చేస్తూ ఉంటారు.సోషల్ మీడియా కూడా అందుబాటులో ఉండటంతో వెంటనే వాటి ద్వారా వాళ్లకు నేరుగా సలహాలు ఇస్తూ ఉంటారు.
ఒకవేళ సెలబ్రెటీల నుండి ఏవైనా నెగిటివ్గా కనిపిస్తే వెంటనే కామెంట్లు పెడుతూ ఉంటారు.తాజాగా యాంకర్ వర్షిణి కూడా కామెంట్స్ ఎదుర్కొంది.
ఇంతకు అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం.
బుల్లితెర హాట్ యాంకర్, ఆర్టిస్టుగా గుర్తింపు పొంది యువతను కన్నార్పకుండా చేసిన గ్లామర్ బ్యూటీ యాంకర్ వర్షిణి.
ఈమె గురించి బుల్లితెర ప్రేక్షకులందరికి పూర్తిగా తెలిసిందే.తన గ్లామర్ తో మాత్రం బాగా రచ్చ చేస్తుంది.
హాట్ యాంకర్స్ అనసూయ, శ్రీముఖి ల కంటే ఎక్కువ గ్లామర్ ను పరిచయం చేసింది వర్షిణి.సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ ప్రతిరోజు గ్లామర్ విందుని వడ్డిస్తుంది.
తన అందాలతో మాత్రం తెలుగు రాష్ట్రాల కుర్రాళ్లను పిచ్చెక్కిస్తుంది.అలా ఈమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది.మొదట సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీగా పరిచయమయ్యింది వర్షిణి.అలా తర్వాత బుల్లితెరపై ప్రసారమైన రియాలిటీ షో ఢీ డాన్స్ లో కూడా యాంకరింగ్ చేసింది.
అందులో తన మాటలతో మరింత పరిచయం పెంచుకుంది.
ఇక ఈ షో నుంచి బయటికి వచ్చాక మరో షో లో కూడా చేసింది.అందులో తన ఎంట్రీ డాన్స్ లతో మాత్రం ఓ రేంజ్ లో పిచ్చెక్కించింది.అందరి దృష్టి తన వైపు లాక్కుంది.
వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది.అంతేకాకుండా పలు వెబ్ సిరీస్ లలో కూడా చేసింది.
ఇక సోషల్ మీడియాలో నిత్యం హాట్ ఫోటోలతో, ఫన్నీ వీడియోలతో బాగా రచ్చ చేస్తుంది.పొట్టి పొట్టి దుస్తులతో హాట్ లుక్ లతో బాగా రెచ్చిపోతుంది.
సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.ఇక తను సోషల్ మీడియాలో చేసే అల్లరి అంతా ఇంతా కాదని చెప్పవచ్చు.ముఖ్యంగా తన అందాలతో కుర్రాళ్లను నిద్ర పోనివ్వకుండా చేస్తుంది.అప్పుడప్పుడు బాగా ట్రోల్స్ కూడా ఎదుర్కొంటూ ఉంటుంది.
ఇదంతా పక్కన పెడితే తాజాగా కొన్ని ఫోటోలు పంచుకుంది వర్షిణి.
అందులో లాంగ్ స్కట్ లో ట్రెడిషనల్ లుక్ లో కనిపించగా కాస్త లావు అయినట్లు అనిపించింది.ఇక ఆ ఫోటోలను చూసిన తన అభిమానులు లైక్స్ కొట్టగా కొందరు కామెంట్లు పెడుతున్నారు.ఇక మరి కొంతమంది ట్రోల్స్ కూడా చేస్తున్నారు.
ఓ నెటిజన్ మాత్రం.లావు గా అవ్వకు బక్కగా అవ్వు.
తినడం బంద్ చేయు అంటూ ఆమెకు ఒక సలహా ఇచ్చారు.ప్రస్తుతం ఆ కామెంట్ తో పాటు ఆ ఫోటోలు కూడా బాగా వైరల్ అవుతున్నాయి.