హైపర్ ఆది నా లవర్ కాదంటున్న యాంకర్.. మరి ఇద్దరి మధ్య ఏమీ లేకపోతే

తెలుగులో ప్రతి బుధవారం ప్రముఖ ఎంటర్ టైన్మెంట్ ఛానల్ ఈటీవీ లో రాత్రి 9.30 నిమిషాలకు ప్రసారమయ్యే "ఢీ" డాన్స్ కార్యక్రమం తెలుగు ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో పెద్దగా చెప్పనవసరం లేదు.

ఈ డాన్స్ షోకి ఒక తెలుగులోనే కాక దాదాపుగా దక్షిణ భారతదేశంలోని అన్ని భాషలకు సంబంధించిన అభిమానులు ఉన్నారు.

అయితే ఒక పక్క జోడీలు డాన్స్ పరంగా అదరగొడుతుంటే మరోపక్క ఈ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సుడిగాలి సుదీర్, రష్మి గౌతమ్, హైపర్ ఆది, వర్షిణిలు ఈ షోకి మరింత వన్నె తెస్తున్నారు.అయితే గత కొద్దికాలంగా హైపర్ ఆది మరియు వర్షిణి ల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవుతుండడంతో వీళ్ళిద్దరూ ప్రేమించుకుటున్నట్లు పలు వార్తలు సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తున్నాయి.

Anchor Varshini, Hyper Aadi, Dhee Jodi, ETV, Sudigali Sudheer, Rashmi Gautham, -

దీంతో ప్రస్తుతం హైపర్ ఆది తన అభిమానుల నుంచి ఈ విషయానికి సంబంధించిన పలు ప్రశ్నలని ఎదుర్కొంటున్నాడు.అయితే తాజాగా యాంకర్ వర్షిణి సోషల్ మీడియాలో తన అభిమానులతో చిట్ చాట్ కార్యక్రమం నిర్వహించింది.

ఇందులో భాగంగా ఓ అభిమాని  "మీరు హైపర్ ఆదిని ప్రేమిస్తున్నారా.?" అంటూ అడిగాడు.దీంతో వర్షిణి సమాధానం చెబుతూ "తమ మధ్య ప్రేమ, గీమా వంటివి ఏమీ లేవని తాము మంచి స్నేహితులమని" సమాధానం ఇచ్చింది.

Advertisement

బుల్లితెర పవర్ స్టార్ సుడిగాలి సుధీర్ కూడా తన ఇంటి సభ్యుడి లాగా ఉంటాడని తమ మధ్య మంచి సాన్నిహిత్యం ఉందని కూడా తెలిపింది.అయితే ప్రస్తుతం వర్షిణి పటాస్, ఢీ జోడి మరియు ఇతర చానళ్లకు సంబంధించినటువంటి పలు ఈవెంట్లు, షోలు తదితర కార్యక్రమాలతో ప్రస్తుతం బిజీబిజీగా గడుపుతోంది.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!
Advertisement

తాజా వార్తలు