బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షోకు అంచనాలకు మించి రెస్పాన్స్ వస్తోంది. ప్రభాస్ ఎపిసోడ్ రెండు భాగాలుగా స్ట్రీమింగ్ కానుండగా ఇప్పటికే రిలీజైన ఫస్ట్ ఎపిసోడ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
బాలయ్య ప్రభాస్ దెబ్బకు ఆహా యాప్ క్రాష్ అయ్యిందంటే ఈ కాంబినేషన్ కు ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో క్రేజ్ ఉందో అర్థం అవుతుంది.ఓటీటీలో ఈ షోకు అంచనాలకు మించి రెస్పాన్స్ వచ్చిందని సమాచారం.
అయితే అన్ స్టాపబుల్ షో హిట్టైన నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ యాంకర్లలో ఒకరైన సుమ హోస్ట్ గా ఇదే తరహా షో ప్రారంభం కానుంది.క్యాష్ షోకు బదులుగా ఈ షో ప్రసా రమవుతుందా? లేక వేరే టైమ్ లో ఈ షో ప్రసారం కానుందా? అనే ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉంది.సెలబ్రిటీలను గెస్ట్ లుగా పిలవడంతో పాటు కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఉండేలా ప్లాన్ చేసుకుని ఈ షోను నిర్వహించనున్నారని సమాచారం అందుతోంది.
అయితే బాలయ్యను మించి మెప్పించడం సుమకు సాధ్యమేనా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
బాలయ్య టాక్ షో మరో నెల రోజుల్లో ముగియనుండగా ఆ తర్వాత సుమ షో ప్రసారమయ్యే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.అయితే సుమ హవా గత కొన్నేళ్లలో ఊహించని స్థాయిలో తగ్గింది.
కొత్త యాంకర్ల ఎంట్రీతో పాటు సుమ షోలు రొటీన్ అవుతున్నాయనే కామెంట్లు సైతం వినిపిస్తున్నాయి.

మరోవైపు బాలయ్య పవన్ కాంబో ఎపిసోడ్ మరింత స్పెషల్ గా ఉండనుందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.ప్రభాస్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ పూర్తైన తర్వాత పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కు సంబంధించి అప్ డేట్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి.పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ ఎపిసోడ్ కోసం ఊహించని స్థాయిలో ఆసక్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే.







