మరో ఇంటికి శ్రీకారం చుట్టిన యాంకర్ శ్యామల... అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందంటూ ట్రోల్!

సోషల్ మీడియా బాగా అభివృద్ధి చెందిన తర్వాత సినిమా సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ వారికి సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.

ఈ క్రమంలోనే కొన్నిసార్లు వారు తెలియజేసే విషయాల ద్వారా పెద్ద ఎత్తున నేటిజన్స్ నుంచి ప్రశంసలు అందుకోగా మరికొన్నిసార్లు విమర్శలను కూడా ఎదుర్కొంటూ ఉంటారు.

ప్రస్తుతం అలాంటి విమర్శలను ఎదుర్కొంటున్నారు యాంకర్ శ్యామల.బుల్లితెర నటిగా యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి యాంకర్ శ్యామల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

ఈమె కెరియర్ మొదట్లో బుల్లితెర సీరియల్స్ లో నటించారు.అనంతరం వెండితెరపై పలు సినిమాలలో సందడి చేశారు.ప్రస్తుతం ఈమె సినిమా ఈవెంట్లకు యాంకర్ గా వ్యవహరిస్తూ బిజీగా ఉన్నారు.

ఇక బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్నటువంటి యాంకర్ శ్యామల ఈ కార్యక్రమం తర్వాత ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి యూట్యూబ్ ఛానల్ ద్వారా తనకు సంబంధించిన అన్ని వీడియోలను విషయాలను అభిమానులతో పంచుకుంటూ పెద్ద ఎత్తున అభిమానులను సొంతం చేసుకున్నారు.ఈ విధంగా శ్యామల తన యూట్యూబ్ ఛానల్స్ ద్వారా గత ఏడాది జులై నెలలో కొత్త ఇంట్లోకి చేరిన విషయాన్ని తెలియజేస్తూ వీడియో అందరితో పంచుకున్నారు.

Advertisement

ఇలా తన నూతన గృహప్రవేశానికి సంబంధించిన విశేషాలను అభిమానులతో పంచుకున్నటువంటి ఈమె తాజాగా సోషల్ మీడియా వేదికగా మరికొన్ని ఫోటోలను షేర్ చేస్తూ తమ కొత్త ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.దీంతో ఈ ఫోటోలు కాస్త వైరల్ కావడంతో కొందరు ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలపగా మరి కొందరు మాత్రం అదేంటి శ్యామల గారు కొత్త ఇంట్లోకి వెళ్లి ఏడాది కూడా కాకుండానే మరో ఇంటికి భూమి పూజ చేస్తున్నారా ఇది ఎలా సాధ్యమండి అసలు అంత డబ్బు మీకు ఎక్కడి నుంచి వస్తుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.సెలబ్రిటీలు ఇల్లు అంటే సాధారణమైన విషయం కాదు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

పైగా శ్యామల కేవలం సినిమా ఈవెంట్లు మాత్రమే చేస్తున్నారు.మరి ఆమెకు ఏడాదిలోపే మరో కొత్త ఇల్లు కట్టడానికి అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అంటూ పెద్ద ఎత్తున ఈ ఫోటోలపై కామెంట్లు చేస్తున్నారు.

మరి ఈ కామెంట్లకు శ్యామల స్పందన ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది.

వ‌ర్షాకాలంలో నైట్ ఈ విధంగా పాల‌ను తీసుకుంటే మ‌స్తు హెల్త్ బెనిఫిట్స్‌!
Advertisement

తాజా వార్తలు