Shiva Jyothi: మీరు పెడితే ఎమోషన్ నేను పెడితే ప్రమోషనా…. ట్రోల్స్ పై ఘాటుగా స్పందించిన శివ జ్యోతి?

తీన్మార్ వార్తలు ద్వారా తెలంగాణ యాసలో గలగల మాట్లాడుతూ ఎంతో మంచి గుర్తింపు పొందినటువంటి శివ జ్యోతి(Shiva Jyothi) ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో వీడియోలను అభిమానులతో పంచుకొంటూ పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు.ఇక ఈమె ఒకవైపు బుల్లితెర కార్యక్రమాలలో నటిస్తూనే మరోవైపు తన యూట్యూబ్ ఛానల్ వ్యవహారాలన్నింటిని కూడా చూసుకుంటూ ఉన్నారు.

 Anchor Shiva Jyothi Fires On Netizens-TeluguStop.com

ఇకపోతే ఇన్ని రోజులు పాటు శివ జ్యోతి బారాస పార్టీ( BRS ) ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే.

Telugu Anchorshiva, Brs, Congress, Netizens, Shiva Jyothi, Shivajyothi, Telangan

ఈమె తన ఇంస్టాగ్రామ్ యూట్యూబ్ ద్వారా పెద్ద ఎత్తున బిఆర్ఎస్ (BRS) పార్టీకి మద్దతు తెలియజేస్తూ ఎన్నో రకాల వీడియోలను చేయడమే కాకుండా బిఆర్ఎస్ పార్టీకే ఓటు వేయాలి అంటూ కూడా అందరికీ తెలియజేశారు.ఇలా ఈమె పెద్ద ఎత్తున ఈమె ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉండడంతో ఈమె పట్ల భారీ స్థాయిలో ట్రోల్స్ వచ్చాయి.మరొక కారు మీ ఇంటి ముందు రెడీగా ఉంటుందిలే శివ జ్యోతి అంటూ కొందరు కామెంట్లు చేయగా బారాస పార్టీకి ఎన్ని కోట్లకు అమ్ముడుపోయావు అంటూ కూడా ఈమెపై కామెంట్ చేశారు.

Telugu Anchorshiva, Brs, Congress, Netizens, Shiva Jyothi, Shivajyothi, Telangan

ఇలా తన గురించి ఎన్నో రకాల ట్రోల్స్( Trolls ) వచ్చినప్పటికీ శివ జ్యోతి మాత్రం వాటిని పట్టించుకోలేదు అయితే తాజాగా ఎన్నికల ఫలితాలు విడుదలైన తరువాత కాంగ్రెస్ పార్టీ (Congress Party) అధికారంలోకి వచ్చిన తర్వాత ఈమె తన గురించి వచ్చినటువంటి ట్రోల్స్ పైగాటుగా స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్టులు వైరల్ అవుతున్నాయి.ఈ సందర్భంగా ఈమె ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా తనపై వచ్చిన ట్రోల్స్ గురించి స్పందించారు నేను ఇన్ని రోజులు కేటీఆర్( KTR ) అన్నకు అలాగే కేసిఆర్( KCR ) బాపు గారికి మద్దతు తెలియజేస్తూ ప్రమోషన్స్ చేస్తే ఎంతకు అమ్ముడుపోయావు అంటూ కామెంట్స్ చేశారు.

Telugu Anchorshiva, Brs, Congress, Netizens, Shiva Jyothi, Shivajyothi, Telangan

ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఇంస్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మొత్తం అందరూ కూడా మిస్ యు బెస్ట్ ఐటి మినిస్టర్ కేటీఆర్ అన్న కెసిఆర్ సార్ అంటూ కామెంట్స్ చేస్తూ పోస్టులు చేస్తున్నారు.ఇలా కాకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే నేను ముందు నుంచి కూడా సపోర్ట్ చేశాను.నాకు చాలా షాకింగ్ గా అనిపిస్తుంది.నేను పెట్టిన వీడియోల పై ట్రోల్ చేసి లైక్ కొట్టడం అలాగే నేను పెట్టిన స్టోరీకి వ్యతిరేకంగా రియాక్ట్ అయిన వాళ్లు కూడా ఇప్పుడు మిస్ యు కేటీఆర్ అండ్ కెసిఆర్ అంటూ పోస్టులు పెడుతున్నారు అంటూ ఈమె తెలియజేశారు.

మీరు పెడితే ఎమోషన్ నేను పెడితే ప్రమోషనా అంటూ ఈమె తీవ్రస్థాయిలో తనపై ట్రోల్స్ చేసిన వారి పట్ల ఘాటుగా విమర్శలు కురిపించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube