బిగ్ బాస్ బజ్ హోస్ట్ గా యాంకర్ శివ?

బుల్లితెర పై ప్రసారమయ్యే అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ రియాల్టీ షో కి ఎలాంటి ఆదరణ ఉందో మనకు తెలిసిందే.ఇప్పటికే ఈ రియాలిటీ షో తెలుగులో ఐదు సీజన్లను పూర్తి చేసుకొని త్వరలోనే ఆరవ సీజన్ ప్రారంభం కావడానికి సిద్ధమవుతోంది.

 Anchor Shiva As Host Of Bigg Boss Buzz, Anchor Shiva, Bigg Boss Buzz, Star Maa,-TeluguStop.com

అదేవిధంగా ఒక నాన్ స్టాప్ సీజన్ కూడా పూర్తి చేసుకున్న విషయం మనకు తెలిసిందే.ఇకపోతే రెండవ సీజన్ తర్వాత నుంచి బిగ్ బాస్ బజ్ అనే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు.

ఈ కార్యక్రమంలో ముందు సీజన్లో పాల్గొన్న ఒక కంటెస్టెంట్ ను యాంకర్ గా నియమించి, ప్రసారమవుతున్న సీజన్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లను బిగ్ బాస్ గురించి పలు ప్రశ్నలు అడుగుతూ ఉంటారు.

ఈ విధంగా బిగ్ బాస్ సీజన్ 4 బజ్ కార్యక్రమానికి సింగర్ రాహుల్ హోస్ట్ గా వ్యవహరించారు.

అనంతరం సీజన్ 5 బజ్ కార్యక్రమానికి అరియనా యాంకర్ గా వ్యవహరించారు.అదేవిధంగా నాన్ స్టాప్ కార్యక్రమానికి బజ్ గా రవి హోస్ట్ గా వ్యవహరించారు.అయితే ఆ సీజన్ లో పాల్గొన్న కంటెస్టెంట్లను తదుపరి సీజన్ ప్రసారమైనప్పుడు బజ్ కార్యక్రమానికి హోస్టుగా వ్యవహరిస్తున్నారు.

Telugu Anchor Shiva, Bigg Boss Buzz, Ravi, Maa-Movie

ఈ క్రమంలోని త్వరలోనే బిగ్ బాస్ సీజన్ సిక్స్ కార్యక్రమం ప్రసారం కానున్న నేపథ్యంలో బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్లో పాల్గొన్న ఒక కంటెస్టెంట్ ను బిగ్ బాస్ సీజన్ 6 బజ్ హోస్ట్ గా వ్యవహరించనున్నారు.ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి యాంకర్ గా యాంకర్ శివ వ్యవహరిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.శివ ఇదివరకే యూట్యూబ్ ఛానల్ యాంకర్ గా పనిచేసే ఎంతోమంది సెలబ్రిటీలను తన ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసిన విషయం మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ సిక్స్ బజ్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా శివ వ్యవహరించనున్నారని సమాచారం.త్వరలోనే ఈ కార్యక్రమానికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube