మిమ్మల్ని ఎంటర్టైన్ చెయ్యడానికి ఇంత కష్టపడుతాం అంటున్న రవి!

వెండితెర, బుల్లితెర నటులు తమ నటన సమయం లో ఎంతో కష్టపడుతుంటారు.నటించే సమయంలోని ఎన్నో ఘటన లు కూడా జరుగుతుంటాయి.

వాళ్లు ప్రేక్షకులను మెప్పించడానికి తమ కుటుంబాలను సైతం వదిలి కార్యక్రమాలలో పాల్గొంటారు.ఎన్నో రిస్క్ లతో కూడిన ప్రాజెక్టులను కూడా చేస్తుంటారు.

ఇక సినిమా విషయంలో నటీనటులు చేసే ఫైట్లు, డాన్సులు ఇలా ప్రతి ఒక్క విషయంలో ప్రేక్షకులను మెప్పించే వరకు నటిస్తూనే ఉంటారు.ఇక ఏ సమయమని లేకుండా ఎంటర్టైన్మెంట్ అందించే షోలు కూడా ప్రస్తుతం చాలా ముందున్నాయి.

ప్రతి ఒక్కరూ ఎంటర్ టైన్ మెంట్ ను కోరుకుంటున్నారు.కాబట్టి అందరినీ దృష్టిలో పెట్టుకొని వాళ్లకు వినోదాన్ని అందిస్తూ ఎన్నో ఈవెంట్లను చేస్తారు.

Advertisement

ఇక పండగ సమయంలో వాళ్ళు చేసే వినోదాలు అంతా ఇంతా కాదు.ఎంతోసేపు శ్రమిస్తూ ప్రేక్షకులను ఆనందపరుస్తుంటారు.

ప్రస్తుతం ఈటీవీ లో, స్టార్ మా లో చాలా రకాల ఎంటర్ టైన్ మెంట్ షో లు వస్తున్నాయి.ఇందులో యువతను, పలువురు స్టార్ లను ఆహ్వానిస్తూ వాళ్ల ఆటల తో సరదా నింపుతున్నారు.ఇక బుల్లితెర సీరియల్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి తమ నటనతో ఎంతో లీనమైపోతుంటారు.

ఇక కొన్ని షో లలో యాంకర్లు షో పూర్తయ్యేంతవరకు గంటలపాటు నిల్చోవలసి వస్తుంది కూడా.దీనిని ఉద్దేశిస్తూ యాంకర్ రవి తాజాగా ఓ వీడియోను అభిమానులతో పంచుకున్నాడు.అందులో ఉదయం గం.4.37 ని.సమయంను చూపిస్తూ.అక్కడ షూటింగ్ భాగం లో జరుగుతున్న కొన్ని సెట‌్ లను చూపిస్తూ.

వాళ్లు ఎంత కష్ట పడుతున్నారో విషయాన్ని తెలుపుతున్నాడు.అంతేకాకుండా ఆ కార్యక్రమంలో పాల్గొనే పలువురు నటులను చూపిస్తూ వాళ్లు అలసిపోయినట్టుగా, విశ్రాంతి తీసుకున్నట్లుగా కనిపిస్తున్నారు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

ఇదంతా ఎంటర్టైన్మెంట్ ను అందించడానికి చేస్తున్నారని తెలిపారు.ఉదయం మొదలవుతున్న షూటింగులు ఇప్పటికీ కొనసాగుతూనే ఉందని తెలుపుతూ.

Advertisement

మీరు మా మీద చూపించే ప్రేమ తో దీనిని పోల్చలేము అంటూ కామెంట్ పెట్టాడు రవి.ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

తాజా వార్తలు