కూతుర్ని చూడగానే కన్నీళ్లు పెట్టుకున్న యాంకర్ రవి..?

ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్ లకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ ఇవ్వటం వల్ల బిగ్ బాస్ హౌస్ మొత్తం ఎమోషన్స్ తో నిండి పోయిందని చెప్పవచ్చు.

ఈ క్రమంలోనే ఇప్పటివరకు శ్రీరామచంద్ర, మానస్,కాజల్, సిరి కుటుంబ సభ్యులు హౌస్ లోకి ఎంట్రీ ఇస్తూ ఎంతో సందడి చేశారు.

తాజాగా యాంకర్ రవి కుటుంబ సభ్యులు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినట్లు తాజాగా విడుదల చేశారు.ఈ క్రమంలోనే యాంకర్ రవి భార్య నిత్య బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఆమె ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు.

ఇలా తనతో మాట్లాడుతూ ఉండగా తన కూతురు ఎంట్రీ ఇవ్వడంతో రవి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.ప్రతిరోజు తన కూతురిని తలుచుకుంటూ ఉండే రవి ఉన్నఫలంగా తన భార్య కూతురు బిగ్ బాస్ హౌస్ లోకి రావడంతో అతని ఆనందానికి హద్దు లేదు.

Anchor Ravi Get Emotional When He Sees His Daughter Bigg Boss 5, Telugu, Anchor,

ఈ క్రమంలోనే తన కూతురుతో కలిసి ఎన్నో ముచ్చట్లు పెట్టుకున్న రవి తనతో ఆటలు ఆడారు.ఇలా బిగ్ బాస్ హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్ లో అందరు కూడా రవి కూతురుతో ఎంతో సరదాగా గడపగా చివరికి బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళే సమయం ఆసన్నమైందని తెలియజేయడంతో రవి కూతురు ఎంతో బాధతో కన్నీళ్లు పెట్టుకుంటూ హౌస్ నుంచి బయటకు వెళ్ళినట్టు తెలుస్తోంది.ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారింది.

Advertisement
Anchor Ravi Get Emotional When He Sees His Daughter Bigg Boss 5, Telugu, Anchor,
న్యూస్ రౌండప్ టాప్ 20

తాజా వార్తలు