Rashmi : దయ చేసి అలా చేయకండి.. తప్పుడు వార్తలపై ఆవేదన చెందిన రష్మీ!

యాంకర్ రష్మీ ( Rashmi) పరిచయం అవసరం లేని పేరు బుల్లితెరపై జబర్దస్త్ కార్యక్రమంతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ( Sridevi Drama Company ) కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ ఎంత మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి రష్మీ ఒకానొక సమయంలో వెండి తెరపై కూడా సినిమాలలో హీరోయిన్గా నటించారు.అయితే వెండి తెరపై ఈమెకు పెద్దగా అదృష్టం కలిసి రాలేదని చెప్పాలి.

 Anchor Rashmi Respond Over Rumours On Her About Gunturu Kaaram Movie-TeluguStop.com

ఇలా వెండితెర సినిమాల ద్వారా పెద్దగా ప్రేక్షకాదరణ పొందలేకపోవడంతో బుల్లితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.

Telugu Anchorrashmi, Gunturu Kaaram, Kurchi, Poorna, Rashmi-Movie

ఇక బుల్లితెర కార్యక్రమాల ద్వారా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి రష్మీ ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఇదిలా ఉండగా తాజాగా రష్మీ సోషల్ మీడియా వేదికగా తన గురించి వస్తున్నటువంటి తప్పుడు వార్తల స్పందిస్తూ చేస్తున్నటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇటీవల మహేష్ బాబు నటించిన గుంటూరు కారం ( Gunturu Kaaram ) సినిమాలోని కుర్చీ మడత పెట్టే సాంగ్ ఎంతలా ఫేమస్ ఏందో మనకు తెలిసిందే.

Telugu Anchorrashmi, Gunturu Kaaram, Kurchi, Poorna, Rashmi-Movie

ఈ సినిమాలో మహేష్ బాబు శ్రీ లీలతో పాటు నటి పూర్ణ ( Poorna ) కూడా నటించారు.అయితే ఈ పాటలో పూర్ణ స్థానంలో ముందుగా రష్మి అవకాశం వచ్చిందని అయితే అలాంటి గెస్ట్ పాత్రలో నటించడం ఇష్టంలేకే రష్మీ అవకాశాన్ని రిజెక్ట్ చేసింది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇలా తన గురించి వస్తున్నటువంటి తప్పుడు వార్తలు పై రష్మీ స్పందించారు.ఈ పాత్రలో నటించమని నన్ను ఎవరు సంప్రదించలేదని ఈ వార్తలలో ఏ మాత్రం నిజం లేదని తెలిపారు.

అయినా ఈ పాత్రలో పూర్ణ గారు చాలా అద్భుతంగా నటించారు.ఆమెలా మరెవరు ఈ పాత్ర చేయలేదని రష్మీ తెలిపారు.ఇలా తప్పుడు వార్తలను ప్రచారం చేసి నా కెరియర్ పై దెబ్బ కొట్టకండి అంటూ ఈమె ఆవేదన వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube