తెలుగు సినీ ప్రేక్షకులకు జబర్దస్త్ యాంకర్ రష్మీ( Anchor Rashmi ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ప్రస్తుతం రష్మీ శ్రీదేవి డ్రామా కంపెనీ( Sridevi Drama Company ) జబర్దస్త్( Jabardasth ) షోలతో పాటు పలు పండుగ ఈవెంట్లకు కూడా యాంకర్ గా వ్యవహరిస్తూ బాగానే సంపాదిస్తోంది.
అప్పుడప్పుడు సినిమాలలో నటిస్తూ మెప్పిస్తోంది.సినిమాలు అనుకున్న విధంగా రష్మికి కలిసి రాకపోవడంతో బుల్లితెరకే పరిమితం అవుతోంది ఈ ముద్దుగుమ్మ.
ప్రస్తుతం ఒకవైపు బుల్లితెరపై షోలకు యాంకర్ గా వ్యవహరిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ వరుస గ్లామర్ ఫోటో షూట్స్ తో యువతకు అందాల కనువిందు చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.

అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది.ఈ నేపథ్యంలోనే అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు కూడా చెబుతూ ఉంటుంది.ఇది ఇలా ఉంటే తాజాగా యాంకర్ రష్మీ నెటిజెన్స్ పై తీవ్రస్థాయిలో మండిపడింది.
అసలేం జరిగింది.రష్మీ నెటిజన్స్ పై ఎందుకు మండి పడింది అన్న విషయానికి వస్తే.
అయోధ్య రామ మందిర( Ayodhya Ram Mandir ) ప్రారంభోత్సవంపై ఆనందం వ్యక్తం చేస్తూ రష్మి ఇటీవల ట్వీట్ చేయగా.ఓ నెటిజన్ వ్యంగ్యంగా కామెంట్ పెట్టాడు.
అసభ్యకర పనులు చేసి భగవంతుడి నామాన్ని జపిస్తే అన్ని తుడిచిపెట్టుకుపోతాయా? అంటూ కామెంట్స్ చేసాడు.

దాంతో ఆ కామెంట్ పై కాస్త ఘాటుగా స్పందించిన యాంకర్ రష్మీ.నేనేమైనా డబ్బులు ఎగ్గొట్టానా? కుటుంబ బాధ్యత మరిచి తల్లి దండ్రులను రోడ్డు మీద వదిలేశానా? ట్యాక్సులు చెల్లించడం లేదా? చట్ట విరుద్ధమైన పనులు చేస్తున్నానా? మీ దృష్టిలో అసభ్యకరమైన పనులంటే ఏమిటి? ఈ మధ్య కాలంలో ఇలాంటి మాటలు ఎక్కువగా వింటున్నాను.నా వరకు భగవంతుడు సర్వాంతర్యామి.
సనాతన ధర్మంలోని( Sanatana Dharmam ) మంచి విషయం అదే అంటూ సదరు నెటిజన్ కి కాస్త గట్టిగానే కౌంటర్ ఇచ్చింది.ఇక రష్మీ చేసిన ట్వీట్ పై నెటిజన్స్ స్పందిస్తూ ఆమెకు మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు.