తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఒకవైపు బుల్లితెరపై యాంకర్ గా వ్యవహరిస్తూనే మరొకవైపు వెండితెరపై వరుస సినిమా అవకాశాలతో దూసుకు పోతోంది.
అలాగే భాషతో సంబంధం లేకుండా తెలుగు, మలయాళం కన్నడ భాషల్లో కూడా సినిమా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది.లేకపోతే అనసూయ ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
వెండితెరపై సినిమాల్లో నటిస్తూ నటిగా కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకుంది.
సినిమా సినిమాకీ తనలో ఉన్న వేరియేషన్స్ చూపిస్తూ అభిమానుల మనసులలో చెరగని ముద్ర వేసుకుంటుంది.
ఇకపోతే దర్జా అనే లేడీ ఓరియంటెడ్ సినిమా రెడీ గా ఉంది.కేవలం సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సీరిస్ లలో కూడా నటిస్తూ బిజీగా ఉంది.
ఇది ఇలా ఉంటే ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే అనసూయ తాజాగా ఒక సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.ఆ పోస్టులో తాను ఉదయం నాలుగు గంటల వరకు పని చేశానని ఇప్పుడు ప్యాకప్ చెప్పేశారు అంటూ పోస్ట్ చేసింది.
యాక్టర్స్ జీవితాలు ఇదే విధంగా ఉంటాయి అన్నట్టుగా ఆ పోస్ట్ ని చేసింది.

తర్వాత మళ్లీ ఆరున్నర గంటలకు ఫ్లైట్ ఉంది వేరే చోటకి వెళ్లి అక్కడ షూటింగ్ చేయాలి అని అనసూయ చెప్పుకొచ్చింది.ఫ్లైట్ ఎక్కిన తర్వాత కూడా మరొక పోస్ట్ లు చేస్తూ నిద్ర లేకపోయినా సరే ఇలా ప్రయాణించాల్సిందే అంటూ అనసూయ చెప్పుకొచ్చింది.అంటే మొత్తానికి అనసూయ వరుస సినిమా షూటింగులతో బిజీగా ఉంది.
ఇక త్వరలోనే తనలో ఉన్న మరిన్ని వేరియేషన్స్ చూపించబోతోంది ఈ అందాల హాట్ యాంకర్.







