అనసూయ మేడంకు ఆఫర్లు వస్తున్నాయి... కానీ!

జబర్దస్త్‌ షో కారణంగా హీరోయిన్‌ రేంజ్ గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ అనసూయ( Anasuya ) ఇద్దరు కొడుకులు ఉన్నా కూడా హీరోయిన్స్ కు ఏమాత్రం తగ్గకుండా అందంగా కనిపిస్తుంది.

ఉత్తరాది ముద్దుగుమ్మలు సైతం ఆశ్చర్యపోయే విధంగా అందాల విందు చేయడం మనం చూస్తూ ఉన్నాం.

జబర్దస్త్‌( Jabardasth ) లో ఉన్న సమయంలో ఈమెకు హీరోయిన్ గా వరుసగా ఆఫర్లు వచ్చాయి.ఈ మధ్య కాలంలో ఈమె జబర్దస్త్‌ ను మానేసింది.

ఎప్పుడైతే జబర్దస్త్‌ ను మానేసిందో అప్పుడే ఈమె కెరీర్‌ డౌన్ ఫాల్‌ ప్రారంభం అయింది అంటూ విమర్శలు మొదలు అయ్యాయి.కానీ అసలు విషయం ఏంటి అంటే గతంలో మాదిరిగానే అనసూయకు ఆఫర్లు వస్తున్నాయి.

వరుస సినిమాలు వస్తున్నాయి.

Advertisement

కానీ ఆమె నటించిన సినిమాల్లో ఎక్కువ శాతం బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడుతున్నాయి.అంతే కాకుండా ఆమె పాత్రలకు పెద్దగా గుర్తింపు రాలేదు.అనసూయ విమానం( Vimanam ) అనే సినిమా లో నటించిన విషయం తెల్సిందే.

ఆ సినిమా లో అనసూయ వేశ్య పాత్రలో కనిపించింది.విడుదలకు ముందు సినిమా గురించి, ఆమె పాత్ర గురించి ప్రముఖంగా చర్చ జరిగింది.

కానీ ఆమె పాత్ర సినిమాలో ఆకట్టుకోలేక పోయింది.అంతే కాకుండా స్కిన్‌ షో కే పరిమితం అయింది అంటూ విమర్శలు వ్యక్తం అయ్యాయి.మొత్తానికి అనసూయ హీరో

యిన్‌ గా ఆశించిన స్థాయి లో విజయాన్ని సొంతం చేసుకోలేక పోవడంతో పెద్ద సినిమా ల్లో ఆఫర్లు దక్కించుకోలేక పోతుంది అనే టాక్ వినిపిస్తుంది.ఈ సమయంలో జబర్దస్త్‌ కార్యక్రమంలో ఈమె చేస్తూ ఉన్నట్లయితే తప్పకుండా మంచి ఆఫర్లు వచ్చేవి అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.గతంలో బుల్లి తెరపై కూడా సందడి చేయడం వల్ల సినిమా లు ఫెయిల్‌ అయితే పెద్దగా ఎఫెక్ట్ ఉండేది కాదు.

5 Gringos Customer Support And Service Quality (AU) — A Practical Guide
వ‌ర్షాకాలంలో నైట్ ఈ విధంగా పాల‌ను తీసుకుంటే మ‌స్తు హెల్త్ బెనిఫిట్స్‌!

కానీ ఇప్పుడు బుల్లి తెరపై ఆమె సందడి లేదు.అందుకే అనసూయ కు ఆఫర్లు వస్తున్నా కూడా గుర్తింపు లేదు.

Advertisement

తాజా వార్తలు