డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల( Srikanth Addala ) దర్శకత్వంలో కొత్త హీరో విరాట్ కర్ణతో పెదకాపు 1( Peddha Kapu 1 ) అనే సినిమా రాబోతుంది.ఒక గ్రామంలో కులం మధ్య జరిగే గొడవల నేపథ్యంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఇక ఈ సినిమాలో యాంకర్ అనసూయ( Anasuya ) కూడా కీలకపాత్రలో నటించారు.ఈ సినిమాలో ఈమె అక్కమ్మ అనే పాత్రలో నటిస్తున్నట్లు తాజాగా వెల్లడించారు.
ఇక ఈ సినిమా సెప్టెంబర్ 29వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఇందులో భాగంగా తాజాగా నిర్వహించినటువంటి ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా అనసూయ మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
సాధారణంగా అనసూయ ఏం మాట్లాడినా లేదంటే సోషల్ మీడియా వేదికగా ఎలాంటి పోస్టులు చేసిన జనాలలో వైరల్ అవుతూ ఉంటాయి.ఇక ఈమె చేసే పోస్టులకు కామెంట్లకు కొన్నిసార్లు పెద్ద ఎత్తున వివాదాలు కూడా ఏర్పడుతూ ఉంటాయనే సంగతి మనకు తెలిసిందే.తాజాగా ఈ సినిమా వేడుకలో భాగంగా అనసూయ మైక్ తీసుకోగానే ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ అందరూ పెద్ద ఎత్తున కేకలు వేస్తూ గోల చేశారు.దీంతో అనసూయ మాట్లాడుతూ మీరు ఇలా అరవడంతో నన్ను పొగుడుతున్నారా లేదా ట్రోల్ చేస్తున్నారో కూడా అర్థం కావడం లేదని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అనసూయ మాట్లాడుతూ రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో నటించినప్పుడు నా పాత్రకు ఎంతో మంచి గుర్తింపు వచ్చింది.ఆ సమయంలో అందరూ నన్ను రంగమ్మత్త అని పిలవడం మొదలుపెట్టారు.అయితే ఈ పెద్ద కాపు సినిమాలో నేను అక్కమ్మ ( Akkamma ) పాత్రలో నటించాను.ఇలాంటి ఒక అద్భుతమైన పాత్రలో నటించే అవకాశం నాకు కల్పించినందుకు శ్రీకాంత్ అడ్డాలకు కృతజ్ఞతలు అంటూ మాట్లాడారు.
ఇక ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా నన్ను అక్కమ్మ అని పిలుస్తారు అంటూ ఈ సందర్భంగా అనసూయ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
.