యాంకర్ అనసూయ భరద్వాజ్( Anasuya Bhardwaj ).ఈమె గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
యాంకర్ గా, నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న అనసూయ ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతోంది.మొదట జబర్దస్త్ షో( Jabardasth Show )కి యాంకర్ గా వ్యవహరించి మంచి పాపులారిటీని సంపాదించుకున్న అనసూయ ఆ తర్వాత బుల్లితెర పై పలు ఈవెంట్లకు యాంకర్ గా వ్యవహరించడంతోపాటు అప్పుడప్పుడు తన హాట్ పర్ఫామెన్స్ లను ఇరగదీసింది.
జబర్దస్త్ యాంకర్ గా కొనసాగుతూనే వెండితెరపై కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.
అయితే అనుకున్న దాని కంటే మరింత తొందరగా వెండితెరపై తనకు అవకాశాలు వచ్చాయి.ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు వెబ్ సిరీస్లలో నటిస్తోంది.ఇక సినిమా అవకాశాలు ఎక్కువ అవ్వడంతో ఇటీవలే జబర్దస్త్ కి గుడ్ బాయ్ చెప్పేసిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం నటిగా తన సత్తాను నిరూపించుకుంటూ వరుస అవకాశాలతో దూసుకుపోతోంది యాంకర్ అనసూయ.కాగా ఇప్పటికే అనసూయ రంగస్థలం, పుష్ప లాంటి సినిమాలలో ప్రధాన పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.
వీటితో పాటుగా ఖిలాడి, భీష్మ పర్వం, క్షణం, గాడ్ ఫాదర్,పక్కా కమర్షియల్, సోగ్గాడే చిన్నినాయన, చావు కబురు చల్లగా లాంటి ఎన్నో సినిమాలలో నటించి మెప్పించింది.
కెరియర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు హాట్ ఫొటో లను షేర్ చేస్తూ అందాల కనువిందు చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.ఈ మద్య కాలంలో తరచూ సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ చేస్తూ వార్తల్లో నిలుస్తూనే ఉంది అనసూయ.ఇది ఇలా ఉంటే తాజాగా ఆమె ఐదేళ్ల క్రితం దిగిన ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో షేర్ చేసింది.
ఐదేళ్ల క్రితం నేను ఇలా ఉండేదాన్ని.అలాగే నాకు ఈ కాస్ట్యూమ్ అంటే చాలా ఇష్టం అని ఆమె రాసుకొచ్చింది.కాగా అనసూయ ఇంస్టాగ్రామ్ లో చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇదిలా ఉంటే అనసూయ సినిమాల విషయానికి వస్తే.
అనసూయ ప్రస్తుతం పుష్ప 2, రంగమార్తాండ, హరిహర వీరమల్లు, ఫ్లాష్ బ్యాక్, సింబా లాంటి సినిమాలలో నటిస్తోంది.అనసూయ నటించిన రంగ మార్తాండ సినిమా మార్చి 22న ఉగాది పండుగ కానుకగా విడుదల కానుంది.